Barrelakka Sirisha : పెళ్లి చేసుకునే వ్యక్తి ఫోటో రివీల్ చేసిన బర్రెలక్క శిరీష.. క్యూట్ జోడీ అంటూ?

బర్రెలక్క శిరీష( Barrelakka Sirisha ) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ద్వారా కొన్ని నెలల క్రితం ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యారు.ఉద్యోగం రాక బర్రెలు కాస్తున్నానంటూ ఆమె చేసిన కామెంట్లు నిరుద్యోగుల వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించాయి.

 Barrelakka Shirisha Husband Photos Goes Viral In Social Media Details Here Goes-TeluguStop.com

అయితే బర్రెలక్క శిరీష ఈ నెల 28వ తేదీన వెంకటేశ్( Venkatesh ) అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారు.పెళ్లికొడుకు ఫోటోను శిరీష సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


బర్రెలక్క వెంకటేశ్ జోడీ బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఈ జోడీ క్యూట్ జోడీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వెంకటేశ్ ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివారని నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని సమాచారం అందుతోంది.మార్చి నెల 28వ తేదీన శిరీష వెంకటేశ్ పెళ్లి( Sirisha Venkatesh Marriage ) జరగనుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం( Kolhapur Constituency ) నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా శిరీష పోటీ చేశారు.ఎన్నికల్లో ఆమెకు 5754 ఓట్లు వచ్చాయి.డబ్బులు ఖర్చు చేయకుండా ఎలాంటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేకుండా శిరీషకు అన్ని ఓట్లు రావడం కూడా సులువైన విషయం కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.శిరీష పెళ్లి తర్వాత పాలిటిక్స్ లో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తే మాత్రం శిరీషకు తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.శిరీష పెళ్లి తర్వాత కూడా రాజకీయాలకు దూరం కాకూడదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.శిరీష కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.శిరీష కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube