టాలీవుడ్ హీరో రామ్ చరణ్( Ram Charan ), బుచ్చిబాబు కాంబినేషన్ లో తాజాగా ఒక సినిమా మొదలైన విషయం తెలిసిందే.మైత్రీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.
ఆర్.రెహమాన్( AR Rahman ) సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజాగా బుధవారం రోజు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించారు.కన్నడ స్టార్ శివరాజ్ కుమార్( Kannada Star Shivaraj Kumar ) ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
అయితే ఈ సినిమాలో విలన్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరని సమాచారం.

ఈ కథలోని పరిస్థితులు, హీరోకి ఎదురయ్యే సవాళ్లు మాత్రమే.ప్రతినాయక పాత్రని పోషించబోతున్నాయని తెలుస్తోంది.చరణ్ లాంటి మాస్ ఇమేజ్( Mass Role ) ఉన్న ఒక హీరో కోసం ఈ తరహా కథని ఎంచుకోవడం ఓ రకంగా సాహసమే అని చెప్పాలి.
శివరాజ్ కుమార్ పాత్ర కూడా పూర్తిగా పాజిటీవ్ కోణంలో సాగబోతోందని సమాచారం.ఈ పాత్రపై శివరాజ్ కుమార్ కూడా చాలా నమ్మకాన్ని, ఇష్టాన్నీ కనబరుస్తున్నారు.ఆయన తెలుగులో నటించడం ఇదే తొలిసారి.సానా బుచ్చిబాబు కథ చెప్పడానికి వెళ్తే శివరాజ్ కుమార్ కేవలం అరగంట మాత్రమే కేటాయించారట.
కానీ కథ చెబుతున్న విధానం నచ్చి, మరో రెండు గంటల పాటు మాట్లాడుకొన్నారట.

ప్రతీ పాత్రనీ బుచ్చిబాబు( Director Buchi Babu ) అద్భుతంగా మలిచాడని, ఈ సినిమా మరో స్థాయిలో ఉండబోతోందని శివరాజ్ కుమార్ తెలిపారు.కాగా ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.చరణ్, జాన్వీ, శివరాజ్ కుమార్ మినహాయిస్తే మిగిలిన నటీనటుల పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఈ సినిమా కోసం పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉంది.