టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha ) ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు.ఈమె వరస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నటువంటి తరుణంలో మయోసైటిసిస్( Myositis ) అనే వ్యాధి బారిన పడ్డారు.
ఈ వ్యాధి కారణంగా సమంత ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి తరుణంలో కొంత సమయం పాటు సినిమాలకు విరామం ప్రకటించి ఆరోగ్యంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.అయితే ప్రస్తుతం ఈమె అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్నారని తెలుస్తుంది.
ఇలా సినిమాలకు సమంత దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేసేవారు.
ఇదిలా ఉండగా తాజాగా సమంత ఇండియా టుడే కాన్ క్లేవ్ 2024( India Today Conclave 2024 ) లో పాల్గొన్నారు.న్యూఢిల్లీలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సమంతా పాల్గొనడానికి కంటే ముందుగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సమంత తన 14 సంవత్సరాల సినీ కెరియర్ గురించి అలాగే తాను మయోసైటిసిస్ వ్యాధికి గురి కావడం గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.
ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఇండస్ట్రీలో తన క్రష్ ఎవరు అనే విషయాన్ని కూడా ఈమె తెలిపారు.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ నాకు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) అంటే చాలా గౌరవం అని తెలియజేశారు.అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ ( Prabhas ) పట్ల కూడా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ప్రభాస్ అంటే నాకు చాలా గౌరవమని చెప్పారు.ఇక తన క్రష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) అంటూ ఈ సందర్భంగా సమంత తన క్రష్ ఎవరు అనే విషయాన్ని బయట పెట్టడంతో బన్నీ ఫాన్స్ తెగ సంబరపడుతున్నారు.
ఇక నటనలో కూడా బన్నీ తనకు రోల్ మోడల్ అంటూ ఇటీవల సమంత కామెంట్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఆయనే తన క్రష్ అని చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.