పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈయన త్వరలోనే కల్కి ( Kalki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ ( Nag Aswin )దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి అయిందని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది.ఇక ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమా సుమారు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందని తెలుస్తుంది.
ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే( Deepika Pdukone ) హీరోయిన్ గా నటించారు.అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్, కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్( Kamal Haasan ) వంటి వారందరూ కూడా నటించబోతున్న సంగతి తెలిసిందే.
ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక భాషలలో మే 9 వ తేదీ విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు.ఇక ఈ సినిమా మే 9వ తేదీ రాబోతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉన్నటువంటి తరుణంలో ఈ సినిమా విడుదల వాయిదా పడిపోతుందనే వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ సినిమా ఎట్టి పరిస్థితులలోనూ వాయిదా వేయబోమని ఇదివరకు మేకర్స్ తెలిపారు.కానీ ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరగబోయే తేదీలను ఎలక్షన్ కమిషన్ విడుదల చేశారు.ఇక తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ( Elections ) కూడా మే 13వ తేదీ జరగబోతున్నట్లు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.ఇలా ఎన్నికలకు ముందు సినిమా విడుదల చేయడం అనేది వర్కౌట్ కానీ విషయం దీంతో ఈ సినిమా విడుదల వాయిదా( Kalki Movie Release Postpone ) తప్పదు అంటూ ఊహగానాలు మొదలయ్యాయి.
మరి ఈ సినిమా విడుదల గురించి మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.