చాలా మంది ప్రస్తుత తరంలో ఫొటోషూట్స్ చేస్తున్నారు.ముఖ్యంగా ప్రమాదకర రీతిలో స్టంట్స్ చేస్తూ ఫొటోషూట్స్, రీల్స్ చేస్తుంటారు.ఒక్కోసారి ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి.కొందరు అనుకోని రీతిలో ఇలాంటివి చేస్తూ చనిపోతున్నారు.అయితే చాలా మంది మారడం లేదు.ఇదే కోవలో కొందరు బీచ్‌లలో( Beach ) ఫొటోలు దిగుతూ ఆనందిస్తున్నారు.
అయితే ఏ మాత్రం అప్రమత్తంగా లేకుంటే ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
అందమైన బీచ్‌లో, సముద్రపు అలలతో ఆడుకుంటూ ఫొటోలు దిగడం చాలా బాగుంటుంది.
ముఖ్యంగా బీచ్ వద్ద పెద్ద రాళ్లు ఉంటాయి.అలాంటి ప్రాంతాల్లో ఫొటోషూట్స్( Photoshoots ) చాలా బాగుంటాయి.
అదే స్థాయిలో ప్రమాదం కూడా పొంచి ఉంటుంది.అందులోనూ రాళ్లపై ఉంటే అలలకు జారి కింద పడే అవకాశం ఉంది.
ఏ మాత్రం పట్టుతప్పినా తల రాళ్లకు తగిలి స్పాట్‌లోనే చనిపోవొచ్చు.ఇలాగే మోడల్‌గా( Model ) పని చేసే ఓ మహిళ బీచ్ ఒడ్డున రాళ్లపై నిల్చుని ఫొటోలు దిగింది.
అదే సమయంలో భారీ రాకాసి అల ధాటికి ఆమె సముద్రంలో పడిపోయింది.

ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.సముద్ర అలల తాకిడి, తీరంలో స్విమ్మింగ్ చేయడం అనేది చాలా మందికి ఇష్టం.అందుకే చాలా మందికి ఇష్టమైన పర్యాటక ప్రాంతాల్లో ఖచ్చితంగా బీచ్‌లు ఉంటాయి.
ఇదే కోవలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో గతేడాది ఓ రష్యన్ మోడల్ బీచ్ ఒడ్డున ఫొటో షూట్ పెట్టుకుంది.ఆమె ఫ్రెండ్స్, ఫొటోగ్రాఫర్ పైన ఉండగా, ఆ మోడల్ మాత్రం రాళ్లపై నిల్చుని ఫొటోలకు ఫోజులు ఇస్తోంది.
అదే సమయంలో చిన్న చిన్న అలలు వచ్చినా ఆమె పట్టించుకోలేదు.అయితే అకస్మాత్తుగా ఓ భారీ అల( Huge Wave ) తీరానికి వచ్చింది.దాని ధాటికి ఆ మోడల్ జారి సముద్రంలో పడిపోయింది.

అదృష్టవశాత్తూ ఆమె సముద్రంలో ( Sea ) కొట్టుకుపోలేదు.వెంటనే ఆమె తనకు అందిన ఓ రాయిని పట్టుకుని పైకి వచ్చింది.ఒక్క క్షణంలో ఆమె ఏమరుపాటుగా ఉంటే ఖచ్చితంగా చనిపోయేదే.
కానీ అదృష్టం వల్ల బతికి బయటపడింది.గతేడాది జరిగిన ఈ సంఘటన తాలూకా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది.
దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.ఇలాంటి థ్రిల్ ఇస్తాయని, కాని థ్రిల్ కంటే ప్రాణం విలువైందనే విషయం యువత గుర్తుంచుకోవాలని నెటిజన్లు పేర్కొంటున్నారు.
ప్రమాదకర ప్రాంతాల్లో ఇలా ప్రాణాలు పణంగా పెట్టి ఫొటోషూట్స్ చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు.







