తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది.మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్( Ex MP Seetaram Naik ) బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) సీతారాం నాయక్ తో భేటీ అయ్యారు.

బీజేపీ( BJP ) నేతలతో కలిసి సీతారాం నాయక్ నివాసానికి కిషన్ రెడ్డి వెళ్లారు.ఈ క్రమంలోనే ఆయనను పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారని సమాచారం.రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీతారాం నాయక్ తో కిషన్ రెడ్డి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.







