మంగళవారం విశాఖపట్నం పర్యటనలో సీఎం జగన్( CM YS Jagan ) సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.విశాఖలో పారిశ్రామికవేత్తలతో సమావేశంలో వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలుస్తుందని ధీమాగా స్పీచ్ ఇచ్చారు.
అంతేకాకుండా గెలిచిన తర్వాత విశాఖ నుండి పరిపాలన సాగించబోతున్నట్లు విశాఖ( Visakha )లోని రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చాలా కాన్ఫిడెంట్ గా గెలుపు పై సీఎం జగన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు( Ganta Srinivasa Rao ) కౌంటర్ ఇచ్చారు.
వచ్చే ఎన్నికలలో గెలిచాక విశాఖలోనే ఉంటానని జగన్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ లో సెటైర్లు వేశారు.
“నెలలో వస్తా… సంక్రాంతికి వస్తా… ఉగాదికి వస్తా… ఆ ఐదేళ్ల అంకం ముగిసింది.మీరు కాపురానికి వచ్చింది లేదు, రేపు మీరు గెలిచేది లేదు, ప్రమాణ స్వీకారానికి వచ్చేది లేదు.“సిటీ ఆఫ్ డెస్టినీ” ( City of Destiny )గా ఉన్న విశాఖను మీరు వచ్చాక “సిటీ ఆఫ్ డేంజర్” గా మార్చేశారు.ప్రశాంత విశాఖ( Visakha )కు రాజధాని పేరుతో రౌడీల రాజ్యం తెచ్చేశారు.రణరంగ క్షేత్రాన్ని సృష్టించారు.వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నామని సంగతి ఎన్నికలకు ఒక నెల ముందు గుర్తుకొచ్చిందా జగన్మోహన్ రెడ్డిగారు.? మీరు రాకముందు వరకు విశాఖ నగరం అభివృద్ధిలో దూసుకెళ్లింది.మీరొచ్చాకే అభివృద్ధి కుంటుబడిందనేది జగమెరిగిన సత్యం…విశాఖలో ఉన్న పరిశ్రమల్ని పొరుగు రాష్ట్రాలకు తరిమేసి….ఇప్పుడేమో విశాఖలో ఉద్యోగలను కల్పిస్తామని ఊదరకొడుతున్నారు… అందుకే విశాఖ ప్రజలంతా ముక్తకంఠంతో “రావద్దు జగన్.
మాకొద్దు జగన్” అంటూ స్వరం పెంచారు…! మీ మాటలను నమ్మే పరిస్థితిలో విశాఖ వాసులు లేరు… ఇక్కడి ప్రజలు చాలా తెలివైనవారు…విశాఖలో ప్రమాణ స్వీకారం కాదు.విశాఖ నుంచే మీ ప్రభుత్వ పతనం మొదలవుతుందని గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు.” అని గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.