Jayaho BC Public Meeting : 50 ఏళ్లకే నెలకు రూ.4,000 పెన్షన్…చంద్రబాబు సంచలన ప్రకటన..!!

మంగళగిరిలో జరిగిన “జయహో బీసీ” ( Jayaho BC Public Meeting )కార్యక్రమానికి తెలుగుదేశం మరియు జనసేన పార్టీలకు చెందిన నాయకులు భారీ ఎత్తున హాజరయ్యారు.తెలుగుదేశం బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించినట్లు గుర్తు చేశారు.

 Jayaho Bc Public Meeting : 50 ఏళ్లకే నెలకు రూ.4,000 -TeluguStop.com

టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరిగిందని చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తమ స్పీచ్ లో తెలియజేయడం జరిగింది.వైసీపీ ప్రభుత్వం వచ్చాక బీసీలు అనేక రకాలుగా ఇబ్బందులు పాలయ్యారని విమర్శించారు.

మళ్లీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు న్యాయం చేస్తామని ఈ సభలో సంచలన హామీలు ప్రకటించారు.మంగళగిరి సభలో బీసీ డిక్లరేషనన్ నీ చంద్రబాబు( Chandrababu ), పవన్ కళ్యాణ్ విడుదల చేశారు.

Telugu Bc Key, Bcs, Chandrababu, Janasena, Jayaho Bc, Pawan Kalyan, Tdpchandraba

బీసీ డిక్లరేషన్‌లోని అంశాలు( BC Declaration Key Points )

1.బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తాం.5 పెన్షనను నెలకు రూ.4 వేలకు పెంచుతాం.

2.ప్రత్యేక రక్షణ చట్టం: జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలను క్రూరంగా హత్యకు గురయ్యారు.బీసీలపై దాడులు, దౌర్జన్యాల నుండి రక్షణ కోసం ‘ప్రత్యేక రక్షణ చట్టం’ తీసుకొస్తాం.ఎ) సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడుతాం.

3.బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం.
ఎ) వైసీపీ ప్రభుత్వం రూ.75 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించింది.అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ ప్లాన్ నిధులు బీసీల కోనమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

4.స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ను వైసీపీ ప్రభుత్వం 34 శాతం నుండి 24 శాతానికి తగ్గించి, 16,800 పదవులు దూరం చేశారు.అధికారంలోకి వచ్చాక 34 శాతం రిజర్వేషన్లు పునరుద్దరిస్తాం.
ఎ) చట్ట సభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం
.

బి) అన్ని సంస్థలు.నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్
సి) తక్కువ జనాభాతో, ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం.

Telugu Bc Key, Bcs, Chandrababu, Janasena, Jayaho Bc, Pawan Kalyan, Tdpchandraba

5)ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్దరిస్తాం
ఎ) జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం.
బి) దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం.
సి) స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం.
డి) జగన్రెడ్డి ‘ఆదరణ’ లాంటి 30 పథకాలు రద్దు చేశారు.రూ.5000 కోట్లతో ‘ఆదరణ’ పరికరాలిస్తాం.
ఈ) మండల/నియోజకవర్గ కేంద్రాల్లో కామన్ వర్క్ షెడ్స్,
ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం.
ఎఫ్) జగన్ రెడ్డి రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం.

6 .చట్టబద్దంగా కుల గణన నిర్వహిస్తాం

7.చంద్రన్న బీమా రూ.10 లక్షలతో పునరుద్ధరిస్తాం.పెళ్లి కానుకలు రూ.లక్షకు పెంపు

8.శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం.

9.విద్యా పథకాలు అన్నీ పునరుద్దరిస్తాం
ఎ) నియోజకవర్గాల్లోని రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తాం.
బి) షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తాం.
సి) పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ పునరుద్దరిస్తాం.
డి) స్టడీ సర్కిల్, విద్యోన్నతి పథకాలు పునఃప్రారంబిస్తాం.10.బీసీ భవనాలు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తాం.

బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు… బ్యాక్ బోన్ క్లాసెస్( Back Bone Classes ).

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube