టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాల ద్వారా మెజారిటీ సందర్భాల్లో వార్తల్లో నిలిచిన వ్యక్తులలో జీవిత ఒకరు.రాజశేఖర్ కెరీర్ విషయంలో జీవిత గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి.
పలు కార్యక్రమాలకు జీవిత హోస్ట్ గా కూడా వ్యవహరించడం జరిగింది.రాజశేఖర్ ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుండగా జీవిత, రాజశేఖర్( Jeevitha, Rajasekhar ) కూతుళ్లు కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.
అయితే ఈ మధ్య కాలంలో జీవిత ఎలాంటి వివాదాస్పద అంశాల గురించి స్పందించలేదు.జీవిత తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు దాటిందని ఈ 30 సంవత్సరాలలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని ఆమె వెల్లడించారు.
చాలా విషయాలను నేర్చుకున్నానని జీవిత అన్నారు.ఉన్నది ఉన్నట్లు చెప్పడం సరికాదని అలా చేస్తే కొంతమందికి నచ్చదని అర్థమైందని జీవిత అభిప్రాయపడ్డారు.
![Telugu Jeevitha, Matrudevbhava, Rajasekhar, Tollywood-Movie Telugu Jeevitha, Matrudevbhava, Rajasekhar, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/03/jeevitha-comments-goes-viral-in-social-media-details-herea.jpg)
అన్ని అంశాలపై మాట్లాడకపోవడం వల్ల నేను, రాజశేఖర్ నష్టపోలేదని హాయిగా ఉన్నామని ఇప్పుడు పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి వస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.మేమంటే నచ్చని వాళ్ల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదని జీవిత వెల్లడించారు.ప్రస్తుతం మౌనంగా ఉంటున్నామంటే అది భయం వల్ల కాదని ఆమె పేర్కొన్నారు.నేను ఏ విషయంలోనూ భయపడనని ఆమె కామెంట్లు చేశారు.
![Telugu Jeevitha, Matrudevbhava, Rajasekhar, Tollywood-Movie Telugu Jeevitha, Matrudevbhava, Rajasekhar, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/03/jeevitha-comments-goes-viral-in-social-media-details-hereb.jpg)
మాతృదేవోభవ సినిమాలో( Matrudevbhava ) మెయిన్ రోల్ కోసం మొదట నాకు ఆఫర్ వచ్చిందని నేను అంగీకరించలేదని ఆమె చెప్పుకొచ్చారు.ఆ రోల్ ను మాధవి చేసిందని జీవిత అన్నారు.పెళ్లి తర్వాత యాక్టింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు.నా భర్త, పిల్లలే నా ప్రపంచం అని నా లైఫ్ లో అన్నింటి కంటే కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నానని జీవిత అన్నారు.
జీవిత వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.