సూర్యాపేట జిల్లా:అంగన్వాడీ కేంద్రంలో పెట్టాల్సింది సీసీ కెమెరా కాదు పౌష్టికహామని సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్కే యాకుబ్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని ఎంఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో అయన పాల్గొని మాట్లడుతూ అంగన్వాడీ కేంద్రంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పౌష్టికాహారం బాధ్యతలు కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకొని జిల్లా స్థాయి అధికారులను నియమించి వారి పర్యవేక్షణలో వారి బాగోగులు చూసుకోవాలన్నారు.
అలాగే అంగన్వాడీలను ఇతర పనులకు వాడుకోకుండా వారిని కేవలం వారి పనులకే పరిమితం చెయ్యాలని కోరారు.అలాగే సొంత భవనాలు లేక అద్దె భవనాలలో కాలం వెళ్ళబుచుతున్నారని, దాని ద్వారా అనుకోని ప్రమాదాలు సంభవించవచ్చని, ప్రభుత్వం తక్షణమే వాటిని మంజూరు చెయ్యాలని, అలానే పెండింగ్ బిల్లులు చెల్లించి సెక్టార్ మీటింగ్ల సమయంలో ప్రయాణ చార్జీలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవటంతో పాటు కార్మిక సంఘాల నిర్ణయాలు తీసుకోవటం వలన సంస్థ త్వరిగతిన ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.