మాటలు మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న త్రివిక్రమ్( Trivikram ) కెరియర్ మొదట్లో రైటర్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సక్సెస్ లను అందుకున్నాడు.ఇక స్టార్ హీరోలైన వెంకటేష్, నాగార్జున, చిరంజీవి లతో మంచి సినిమాలను చేసి రైటర్ గా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన దర్శకుడిగా మారి నువ్వే నువ్వే సినిమా( nuvve nuvve movie ) చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఆ తర్వాత మహేష్ బాబుతో అతడు సినిమాని( Athadu movie ) చేశాడు.అయితే ఈ సినిమాలో ఎమ్మెస్ నారాయణ కామెడీ ట్రాక్ కి మంచి పేరు వచ్చింది.అదేంటంటే ఒక హోటల్లో సునీల్ కూర్చొని మహేష్ బాబు చిన్నప్పటి క్యారెక్టర్ గురించి చెబుతుంటే ఆ పక్కనే మాడిపోయిన మసాలా దోశ తినుకుంటూ ఎమ్మెస్ నారాయణ( Ms Narayana ) ఉంటాడు.
ఆ టైమ్ లో వీళ్ళ మ్యాటర్ లోకి ఆయన ఇన్వాల్వ్ అయి చెప్పే డైలాగ్స్ గాని, పెట్టి ఎక్స్ప్రెషన్స్ గాని ప్రేక్షకుల్ని అప్పట్లో విపరీతమైన ఆనందానికి గురి చేశాయని చెప్పడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.ఈ సినిమాలో ఆ ఎపిసోడ్ మాత్రం చాలా హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి.
అయితే ఈ సీన్ రాయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే త్రివిక్రమ్ చిన్నప్పుడు ఒక హోటల్లో టిఫిన్ చేస్తున్నప్పుడు పక్కనున్న వాళ్లు ఇలా మాట్లాడుతూ ఉండేవాళ్ళట.వాళ్ళ మాటలకి త్రివిక్రమ్ కి కౌంటర్ ఇవ్వాలి అని అనిపించేదట కానీ కౌంటర్ ఇస్తే బాగోదు అని చెప్పి వదిలేసేవాడంట.అలా అప్పటి రోజులని గుర్తు చేస్తూ ఈ సినిమాలో ఈ సీన్ ను రాశాడట.ఈ సినిమాతో ఒక మంచి విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటూ వచ్చాడు.
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు…
.