ప్రస్తుత రోజులలో ల్యాప్‌టాప్‌లు,మొబైల్స్ కళ్లకు( Eyes ) పెద్ద శత్రువులుగా మారిపోయాయి అని కచ్చితంగా చెప్పవచ్చు.ఈ సమాజంలోని పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు.
మరోవైపు కోవిడ్ తర్వాత కాలం నుంచి పెద్ద వారు కూడా మొబైల్ ఫోన్ కు అతుక్కుపోతున్నారు.ఆ సమయం ఈ సమయం అని తేడా లేకుండా ఏ సమయంలో చూసినా సోషల్ మీడియా వీడియోలు చూస్తూ ఫోన్లతో ఎక్కువగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు.
ల్యాప్‌టాప్‌లు,మొబైల్స్( Laptops Mobile Phones ) నుంచి వచ్చే బ్లూ లైట్ కళ్ళకు ఎంతో హానికరం.ఇది కంటి చూపును బలహీనపరుస్తుంది.
రెటీనా పై ఒత్తిడితో పాటు చిన్న వయసులోనే అద్దాలు పెట్టుకోవాల్సిన పరిస్థితికి దారితీస్తుంది.కంటి సమస్యలున్న చాలా మంది లేజర్ సర్జరీ( Laser Surgery ) కూడా చేయించుకుంటూ ఉంటారు.
కాబట్టి కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కిందే నియమాలు తప్పకుండా తెలుసుకొని పాటించాలి.అప్పుడు మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
కన్నులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే కళ్ల ఆరోగ్యాన్ని పెంచేందుకు కేవలం 15 రోజులు పాటు ఈ ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకుంటే చాలానీ ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మరి ఆ పోషకాహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ ప్రత్యేకమైన పదార్థాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు 200 గ్రాముల వేన్న, 100 గ్రాముల బాదం( Almonds ), 50 గ్రాముల కొబ్బరి, 20 గ్రాముల ఫెన్నెల్, 20 గ్రాముల నువ్వులు, 20 గ్రాముల అవిసె గింజలు( Flaxseeds ), 10 గ్రాముల మిరియాలు, 400 గ్రాముల బెల్లం, 100 గ్రాముల దేశీ నెయ్యి తీసుకోవాలి.
ఒక పాన్ లో ఒక చెంచా నెయ్యి( Ghee ) వేసి వేడి చేయాలి.దీనిలో బాదంపప్పు వేసి కొద్దిగా వేయించి పక్కన పెట్టాలి.బాణలిలో మరో చెంచా నెయ్యి వేసి అందులో సోపు, నువ్వులు తురిమిన కొబ్బరి, అవిసి గింజలు వేసి వేయించాలి.మధ్యలో కొద్దిగా మిరియాల పొడి కూడా వేసి మిక్స్ చేయాలి.
అలాగే ప్రతిదీ 20 నిమిషాలు వేయించాలి.ఇప్పుడు వీటన్నింటినీ చల్లార్చి మిక్సీలో పొడి గా చేసుకోవాలి.
ఆ తర్వాత మిగిలిన నెయ్యినీ పాన్ లో వేసి పొడిని అందులో వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు చల్లార్చి కొద్దిగా నెయ్యి చేతులకు రాసుకొని ఈ పొడిని లడ్డులా( Almond Flaxseeds Laddo ) తయారు చేసుకోవాలి.ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో ఒక లడ్డు తినాలి.ఇందులోనీ పోషకాలు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి.మూడు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు ప్రతిరోజు ఈ లడ్డులు ఒకటి చొప్పున తినిపించాలి.15 రోజులు నిరంతరం వీటిని తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.