ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలలో( celebrities ) చాలామంది బాడీ షేమింగ్ వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.కొంచెం లావు పెరిగినా సెలబ్రిటీలపై మరీ దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి.
చిన్న సెలబ్రిటీల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు అందరూ బాడీ షేమింగ్ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.బిగ్ బాస్ షో( Bigg Boss Show ) ద్వారా పాపులర్ అయిన శ్వేతావర్మ మాట్లాడుతూ మీరు నాకు ఆహారం పెట్టడం లేదని డబ్బులివ్వడం లేదని ఆమె తెలిపారు.
నా వర్క్ నేను చేస్తున్నానని నా కష్టంతో నేను డబ్బులను సంపాదిస్తున్నానని శ్వేతావర్మ( Shweta Varma ) చెప్పుకొచ్చారు.ఉద్యోగం చేసుకుంటూ సినిమాలు చేస్తున్నానని శ్వేతావర్మ కామెంట్లు చేశారు.
మీరు నా గురించి కామెంట్లు చేయాల్సిన అవసరం లేదని నేను ఎలా ఉన్నా మీకు అవసరం లేదని ఆమె తెలిపారు.లావుగా ఉన్నారని కామెంట్లు చేయాల్సిన అవసరం లేదని శ్వేతావర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అమ్మాయిలు ఎలా ఉండాలనేది కూడా మీరు చెబుతారా అంటూ శ్వేతావర్మ ప్రశ్నించారు.మగ హీరోలు ఎలా ఉన్నా ఇలాంటి కామెంట్లు ఎందుకు చేయరని ఆమె అన్నారు.ఆడవాళ్లు మాత్రం ఇలాగే ఉండాలంటూ కామెంట్లు చేయడం ఎంతవరకు సమంజసం అని శ్వేతావర్మ అభిప్రాయపడ్డారు.శ్వేతావర్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు సైతం శ్వేతావర్మకు మద్దతు ప్రకటించడం గమనార్హం.శ్వేతావర్మ ప్రస్తుతం పలు బుల్లితెర షోలతో బిజీగా ఉన్నారు.ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీకి 75 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.శ్వేతావర్మను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.శ్వేతావర్మ కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.శ్వేతావర్మ కెరీర్ ప్లానింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని సమాచారం అందుతుండటం గమనార్హం.