తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం స్కామ్( Sheep Distribution scheme scam ) మరువకముందో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది.రైతుబీమా, రైతుబంధు( Rythu Bandhu ) పథకాల్లో సుమారు రూ.2 కోట్ల కాజేసినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.
బతికున్న వారి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించిన అధికారులు డబ్బులు కాజేసినట్లు నిర్ధారించారు.రైతుబంధులో రూ.కోటి, రైతుబీమాలో మరో రూ.కోటి కొట్టేసినట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది.ఎస్ఐసీ( SIC ) ఫిర్యాదుతో విషయం వెలుగులోకి రాగా.
రంగారెడ్డి జిల్లా( Ranga Reddy District )కు చెందిన ఓ వ్యవసాయ విస్తరణాధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు.అలాగే ఈ కుంభకోణం విషయంలో మరో ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు.