బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా, నిర్మాతగా కొనసాగుతున్నటువంటి వారిలో జాకీ భగ్నానీ ( Jacky Bhagnani )ఒకరు.ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇక సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రకుల్ ( Rakul )అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకొని బాలీవుడ్ నటిగా కూడా కొనసాగారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఇద్దరు మధ్య పరిచయం ఏర్పడటం అది ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది.

ఇక నేడు ఈ జంట గోవా( Goa )లో ఎంతో అంగరంగ వైభవంగా తమ పెళ్లి వేడుకను జరుపుకున్నారు.గత మూడు రోజులుగా గోవాలో వీరిద్దరి వివాహ వేడుకలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఇక నేడు ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు.అయితే జాకీభగ్నానిని పెళ్లి చేసుకోవాలి అంటే ఆయన కుటుంబ సభ్యులు రకుల్ ప్రీతిసింగ్ కి కండిషన్లో పెట్టారట ఈ కండిషన్ లకు తప్పకుండా ఒప్పుకోవాలని వీటిలో ఎలాంటి మార్పులు లేవంటూ కొన్ని కండిషన్లు పెట్టారని తెలుస్తోంది.

పర్యావరణ పరిరక్షణపై చాలా ఆసక్తి ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడు.తన పెళ్లి కూడా పర్యావరణ హితంగా జరగాలని కండీషన్లు లేకుండా పెళ్లి జరగాలని సూచించారు పెళ్లి వేడుకలలో ఏ విధమైనటువంటి టపాకులు కాల్చకూడదని నిషేదించారట అంతేకాకుండా పెళ్లిలో ఎక్కువగా ప్లాస్టిక్ ఉపయోగించకూడదని ఆయన చెప్పారు అంతేకాకుండా పెళ్లికి వచ్చే అతిధులకు ఆహార విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఆహార పదార్థాలను తయారు చేశారని తెలుస్తోంది.ఇక పెళ్లికి వచ్చిన అతిథులకు రిటన్ గిఫ్ట్ కూడా విత్తనాలు మొక్కలను అందించారని సమాచారం.ఇలా ఈ కండిషన్ లకు తప్పకుండా తన పెళ్లిలో పాటించాలని రకుల్ కుటుంబానికి భగ్నాని కుటుంబ సభ్యులు కండిషన్లు పెట్టారని తెలుస్తోంది.







