మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి : అదనపు కలెక్టర్ పి.గౌతమి

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న ఆలయంలో వైభవంగా నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.గౌతమి ఆదేశించారు.

 Arrangements For Mahashivratri Should Be Completed Quickly Additional Collector-TeluguStop.com

బుధవారం ఆలయ అధికారులతో కలసి గుడి చెరువు పార్కింగ్ స్థలం, ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు.

ముఖ్యంగా త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, పటిష్టమైన క్యూలైన్ల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.పరిశీలనలో ఆలయ ఈఓ కృష్ణప్రసాద్, మున్సిపల్ కమీషనర్ అన్వేష్, ఆలయ ఈఈ రాజేష్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీరాములు, ఎడ్ల శివ, తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube