సూర్యాపేట జిల్లా:గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నయీమ్ హత్య, సంపాదించిన ఆస్తుల వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోకి తీసుకొని గత ప్రభుత్వం నయీం డైరీని కోర్టులో ప్రవేశపెట్టారా లేదా? బాధ్యతలకు న్యాయం చేశారా లేదా? అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న చొరవ తీసుకోని చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల కృష్ణ కోరారు.ఆస్తులు, లాండ్స్,గోల్డ్,ప్లాట్,డబ్బు వివరాలు ఇంత వరకు రాష్ట్ర ప్రజలకు తెలియజేయకపోవటానికి కారణం ఏమిటన్నారు?
చెప్పకపోవడం గత ప్రభుత్వం చేసిన తప్పిదమని,నయీమ్ ఆస్తులు ఏమయ్యాయో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకు వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు.అందుకే సమగ్ర విచారణ జరపాలని, యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ల్యాండ్ సెటిల్మెంట్స్ కవిత మనుషులకు నయీమ్ కు మధ్య జరిగిన సంభాషణపై విచారణ చేపట్టాలని,అన్ని వివరాలను నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వెలికితీసి, బాధితులకు న్యాయం చేయాలన్నారు.