విశాఖ ఈస్ట్ లో టీడీపీ నిర్వహిస్తున్న ‘శంఖారావం’( Shankaravam ) సభ లో టీడీపీ నేత నారా లోకేశ్ పాల్గొన్నారు.టీడీపీ -జనసేన అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అవసరం అయితే తమ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్( Visakha Steel Plant ) ను కొనుగోలు చేసి కాపాడుతుందని తెలిపారు.ఈ నేపథ్యంలో విశాఖ ప్రజలకు ఆయన హామీ ఇస్తున్నట్లు తెలిపారు.
సీఎం జగన్( CM YS Jagan ) విశాఖ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదని విమర్శించారు.పరిపాలన రాజధాని తెస్తామంటూ భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.
రిషి కొండకు గుండు కొట్టి ఐదు వందల కోట్లతో ఒక్కరి కోసం ఇంటిని నిర్మిస్తున్నారని విమర్శించారు.
చెత్తపై పన్ను పెంచారు తప్ప పేదలకు ఇళ్లు కట్టలేదని, ఎక్కడా సరైన రోడ్లు వేయలేదని పేర్కొన్నారు.బొత్స, విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ), వైవీ సుబ్బారెడ్డి కుటుంబాలు విశాఖను దోచుకునేందుకు హక్కులు ఇచ్చారని ఆరోపణలు చేశారు.అయితే టీడీపీ( TDP ) అధికారంలోకి వస్తే ఆరు హామీలను అమలు చేస్తామన్నారు.
మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు.మహిళలకు రూ.15 వేల సాయం చేస్తామన్న ఆయన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు.నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని హమీ ఇచ్చారు.