Ranbir Kapoor : రణబీర్ కపూర్ ని కోపంగా ఉండటం చూడటం అనేది జరగని పని అంట …అందులో నిజం ఎంత ?

రణబీర్ కపూర్.( Ranbir Kapoor ) ఈ మధ్యనే ఆనిమల్( Animal Movie ) అనే సినిమాతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ని కూడా ఒక కుదుపు కుదిపేసాడు.

 Bollywood Hero Ranbir Kapoor Is A Smiling Machine-TeluguStop.com

ఈ సినిమాలో యాంగ్రీ యంగ్ మాన్ గా ఆయన నటన చాలా అద్భుతంగా ఉంది.ఇలాంటి ఒక యాంగ్రీ క్యారెక్టర్ పోషించాలంటే రణబీర్ కపూర్ తర్వాతే ఎవరైనా అనే విధంగా ఉంటుంది అతని నటన.ఆనిమల్ సినిమాలో ఇంతటి బీభత్సం చూసిన తర్వాత ఎవరైనా రణబీర్ కపూర్ అసలు ఎప్పుడు కోపంగా ఉండరు అంటే నమ్ముతారా ? ఆ వాయిలైన్స్ తో కూడిన యాంగ్రీ నిజంగా అతని జీవితంలో అస్సలు లేదు అంటే నమ్మశక్యంగా ఉండదు కదా కానీ అది నిజమే.

-Movie

ఇక ఆనిమల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) ఎన్నోసార్లు చిరాకు పెట్టిన, కొన్ని సీన్స్ మళ్ళీ మళ్ళీ తీసిన, ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఏ రోజు రణబీర్ కపూర్ ఇబ్బంది పడలేదట.ఎప్పుడు నవ్వుతూనే ఉండేవారట.అంతటి యాంగ్రీ సన్నివేశాలను( Angry Scenes ) రణబీర్ కపూర్ తప్ప మరో హీరో కూడా మ్యాచ్ చేయలేరు అనే విధంగా ఉంటాయి.

కానీ షూటింగ్ లో రణబీర్ కపూర్ మాత్రం ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూనే ఉంటారట ఎంతటి టఫ్ సిచ్యువేషన్ లో కూడా ఆయన కోపం తెచ్చుకోరట.షూటింగ్ లొకేషన్లో కూడా ఏ రోజు తన అసిస్టెంట్స్ పై లేదా ఇంకెవరిపై కూడా కోపం చూపించిన సందర్భాలు అసలు ఉండవట.

అలా ఎప్పుడూ నవ్వుతూ ఉండడం ఆయనకు ఉన్న అతిపెద్ద అలవాటు.

-Movie

సాధారణంగా హీరోలు ప్రమోషన్స్ సమయంలో లేదా పబ్లిక్ చూస్తున్నారు అనుకున్నప్పుడు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు కానీ ఇలా నిజ జీవితంలో ప్రతిరోజు, ప్రతి సమయం నవ్వుతూ ఉండటం అంటే అది అందరికీ అయ్యే పని కాదు.ఈ విషయంలో రణబీర్ కపూర్ నిజంగా ఒక గొప్ప వ్యక్తి అని అనుకోవాల్సిందే.అలాగే తన ప్యూర్ క్వాలిటీ గా కూడా తన నవ్వుని అనుకోవచ్చు.

చాలామంది అతడిది ఫేక్ నవ్వు లేదా ప్లాస్టిక్ నవ్వు అని అనుకుంటారు కానీ ఆయన ఎల్లప్పుడూ అలా నవ్వుతూనే ఉంటారు అది ఆయనకు దేవుడు ఇచ్చిన వరం అని అనుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube