విశాఖలోని మంత్రి గుడివాడ అమర్నాథ్( Minister Gudivada Amarnath ) నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మెగా డీఎస్సీ( Mega DSC ) ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఇంటి ముట్టడికి నిరసనకారులు ప్రయత్నించారు.
మినీ డిఎస్సీ కాదని.మెగా డీఎస్సీ ప్రకటించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
దీంతో మంత్రి గుడివాడ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అయితే ప్రభుత్వం ఇటీవలే 6,100 పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు నిరసన( Unemployees Protest ) వ్యక్తం చేస్తున్నారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు.