చాలామంది హీరోయిన్స్ పెళ్లయ్యాక కుటుంబంతో కలిసి ఉండడానికి ఇష్టపడరు.ఇవాళ రేపటి రోజుల్లో హీరోయిన్స్ మాత్రమే కాదు సాధారణ అమ్మాయిలు కూడా పెళ్లయ్యాక వేరే కాపురాలు పెడుతున్నారు.
ఎందుకంటే వారికి కుటుంబం మొత్తం కలిసి ఉంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు.పైగా ఉమ్మడి కుటుంబాలు( Joint Families ) ఈరోజుల్లో ఎక్కడ ఉంటున్నాయి.
పెళ్లి అయిపోతే చాలు భార్యాభర్తలు( Wife and Husband ) ఇద్దరు విడిగా కాపురం పెట్టడం, వీకెండ్స్ కి అలా పండగలకి కలవడం మాత్రమే జరుగుతుంది.అవి కూడా కొంతవరకే మిగతా కొంతమంది జీవితాలు మరీ దారుణంగా ఉంటున్నాయి.
కానీ ఇలాంటి రోజులలో హీరోయిన్ అయినప్పటికీ స్టార్ హీరో కుటుంబానికి కోడలుగా వచ్చి ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా తన జీవితాన్ని మార్చుకుంది జ్యోతిక.
అలా అంత సాధారణ జీవితానికి ఎలా అలవాటయిందో తెలియదు కానీ సగటు కోడలికి ఉండాల్సిన అన్ని బాధ్యతలు జ్యోతికలో ఉన్నాయి.పెళ్లయిన కొత్తలో సూర్య తన భార్యతో కలిసి తన తండ్రి శివకుమార్( Sivakumar ) కట్టిన ఇంట్లోనే ఉండేవారు.అప్పటికి అందరూ కలిసే ఉండేవారు.
ఆ ఇల్లు చిన్నగా ఉన్న అందరూ అడ్జస్ట్ అయి అందులోనే ఉండేవారు.సూర్య( Hero Surya ) సినిమాల్లో బాగానే సంపాదించాడు కాబట్టి కొన్నాళ్ళకు ఒక పెద్ద ఇల్లు కట్టి అందరిని ఆ ఇంటికి షిఫ్ట్ చేశారు.
కానీ కార్తీ( Hero Karthi ) పెళ్లాయక కూడా ఆ ఇంట్లోనే ఉండాలని జ్యోతిక పట్టు పట్టిందట.ఆయన కూడా పెళ్లి చేసుకొని మరో ఇంటికి వెళ్లిపోవాలని అనుకున్నారట ముందు.
కానీ జ్యోతిక( Jyothika ) ఉమ్మడి కుటుంబాన్ని విడిపోవాలని కోరుకోలేదు.తన మరిది భార్య పిల్లలతో సహా ఆ ఇంట్లోనే ఉండాలని ఆమె కోరుకుందట.ఇప్పటికీ అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉంటున్నారు.శివకుమార్ దంపతులు ఇద్దరు కొడుకులు కోడళ్ళతో పాటు మనవళ్లు, మానవరాళ్లతో కలిసి సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతున్నారు.ఇది కేవలం జ్యోతిక వల్లే సాధ్యమైంది.ఆ స్థానంలో మరో అమ్మాయి ఉండి ఉంటే ఈ రోజు ఆ కుటుంబం మూడు ఇళ్లల్లో ఉండేవారు.