Cloves : ప్రతిరోజు పడుకునే ముందు రెండు లవంగాలు నమిలితే.. ఈ సమస్యల నుండి ఉపశమనం..!

కాస్త ఘాటుగా ఉండే లవంగాలలో( Cloves ) కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.అలాంటి రెగ్యులర్ గా ఉండే లవంగాలను అస్సలు విస్మరించకూడదు.

 Amazing Health Benefits Of Eating Cloves At Night-TeluguStop.com

ఇందులో ఎన్నో ఆరోగ్య, బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి.లవంగాలను మనం రెగ్యులర్ గా ఉపయోగిస్తూ ఉంటాము.

ఇవి అన్ని అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా కూడా సహాయపడతాయి.మనలో చాలామంది ఇంటి చిట్కాలలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే లవంగాలను మసాలా దినుసులలో రారాజు గా కూడా పిలుస్తారు.మసాలా వంటలకు లవంగాలను ఎక్కువగా వాడుతూ ఉంటాము.

అయితే మనలో చాలామందికి లవంగాలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసి ఉండదు.

Telugu Benefits, Sugar Levels, Powder, Problems, Telugu-Telugu Health

వాటి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కూడా కలుగుతుంది.లవంగాలలో విటమిన్ సి( Vitamin C ), ఫైబర్, మాంగనీస్, విటమిన్ కే, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తుంది.రాత్రి సమయంలో లవంగాల నీటిని తీసుకోవచ్చు.

లేదా రెండు లవంగాలను బుగ్గన పెట్టుకొని నమిలి రసాన్ని కూడా మింగవచ్చు.లవంగాల నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

లవంగాలను వేయించి పొడి చేసుకుని నిల్వ చేసుకోవాలి.ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో, చిటికెడు లవంగాల పొడి( Cloves Powder ) వేసి కలిపి తాగాలి.

ఇలా రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను నమాలాలి.రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో రెండు లవంగాలు నానబెట్టి మరుసటి రోజు ఉదయం నాడు ఆ నీటిని తాగాలి.

Telugu Benefits, Sugar Levels, Powder, Problems, Telugu-Telugu Health

ఇలా తీసుకుంటే లవంగాలలో ఉన్న ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.ముఖ్యంగా చలికాలంలో లవంగం తీసుకోవడం వలన మెరుగుపరుచుకోవచ్చు.అలాగే అధిక బరువు సమస్య( Overweight Problem ) తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది.జీవ క్రియను వేగవంతం చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా కూడా చేస్తుంది.

ఇక దంత సమస్యలు ఉంటే దంత సమస్యలను కూడా తగ్గిస్తుంది.అయితే దంత సమస్యలు ఉన్నప్పుడు పంటి కింద లవంగం మొగ్గను పెట్టుకుంటే సరిపోతుంది.

ఇక డయాబెటిస్ ఉన్న వారిలో కూడా రక్తంలో చక్కెర స్థాయిలను( Blood Sugar Levels ) నియంత్రిస్తుంది.ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కాపాడుతుంది.

ఆక్సీకరణ తగ్గించి వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube