2022లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ విక్రమ్( Vikram ) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు.
ఈ మూవీలోని పాటలు, బిజిఎం కూడా సోషల్ మీడియాలో బాగా హీట్ అయ్యాయి.ఈ మూవీలో కమల్ హాసన్ టైటిల్ పాత్రలో నటించారు.
అతడి నటన వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు.ఇక గజినీ మూవీ ఫ్రేమ్ సూర్య కూడా ఒక క్యామియో రోల్ చేశాడు.
రోలెక్స్ అనే పాత్రలో అతడు మెరిసాడు, ఇది ఒక బ్యాడ్ క్యారెక్టర్.అందుకే సూర్య ఇందులో నటించనని ముందుగానే చెప్పేసాడు.
లోకేష్ కనకరాజు ఈ క్యారెక్టర్ కు సూర్య మాత్రమే బాగా సూట్ అవుతాడని మొదటగా సూర్యకే కథ వినిపించాడు.అయితే సూర్య అలాంటి చెడు క్యారెక్టర్ లో తాను చేయనని స్పష్టం చేశాడు.
కొద్ది రోజుల తర్వాత కమల్ హాసన్( Kamal Haasan ) సూర్యకి ఫోన్ చేసి ఆ పాత్రలో చేయాలని పోరాడు.కమలహాసన్ అడగడంతో సూర్య ఆ మాట తీసేలేకపోయాడు వెంటనే ఏమీ ఆలోచించకుండా ఆ పాత్రలో చేయడానికి ఒప్పుకున్నాడు.అది బ్యాడ్ క్యారెక్టర్ అయినా సరే 100% ఎఫెక్ట్స్ పెట్టి ఆ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేశాడు అందువల్ల ఆ వేషం చిన్నదైనా సినిమా ప్రేక్షకులకు పై బాగా ప్రభావం చూపింది.రోలెక్స్ క్యారెక్టర్ ఎంత హైలైట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.
దీని తర్వాత కమల్ హాసన్ సూర్య కలిసి మళ్ళీ అన్నదమ్ములుగా నటించనున్నారని తెలుస్తోంది.అది విక్రం 2 లో జరిగే అవకాశం ఉండొచ్చు.వీరిద్దరూ ఫుల్ లెన్త్ రోల్ చేస్తే ఆ సన్నివేశాలు థియేటర్‌లో ఈలలు వేయిస్తాయని చెప్పుకోవచ్చు.ప్రస్తుతం కంగువ, సర్ఫిరా సినిమాల్లో సూర్య నటిస్తున్నాడు.సూర్య( Surya ) నటించిన కంగువ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాతో సూర్య పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
కల్కి 2898 AD, ఇండియన్ 2, థగ్ లైఫ్ సినిమాల్లో కమల్ హాసన్ నటిస్తున్నాడు.ఈ సినిమాలపై కూడా భారతదేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ కావచ్చు.ఇక లోకేష్ కనకరాజు కూడా నెక్స్ట్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.