ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి( Kolagatla Veerabhadra Swamy )పై టీడీపీ నేత నారా లోకేశ్ ఫైర్ అయ్యారు.నియోజకవర్గాన్ని కోలగట్ల అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారని ఆరోపించారు.
కోలగట్ల కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్( Real Estate ) పేరుతో నిరుపేదల భూములను లాక్కొని దందాలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వ భూమిలో పార్టీ కార్యాలయం కడుతున్నారని పేర్కొన్నారు.జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.ఎమ్మెల్యే కోలగట్ల, ఎమ్మెల్సీ అనంతబాబు కలిసి విజయనగరాన్ని గంజాయి అడ్డాగా మార్చేశారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో గంజాయి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రెండు నెలల్లో టీడీపీ – జనసేన ప్రభుత్వం( TDP-Janasena Govt ) వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.