రష్మిక మందన్న ఇటీవల సరికొత్త తాజాగా అరుదైన రికార్డు అందుకున్న సంగతి మనకు తెలిసిందేఫోర్బ్స్( Forbes ) ఇండియా మ్యాగజైన్ 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది నేషనల్ క్రష్.ఇంత చిన్న వయసులోనే ఇలాంటి ఘనత అందుకున్నటువంటి నటిగా రష్మిక మందన్న ( Rashmika Mandanna ) పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
ఇలా ఈమె ఫోటో మ్యాగజైన్ కవర్ పేజీపై రావడంతో ఎంతోమంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఈమెకు అరుదైన ఈ రికార్డు రావడంతో అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే నటుడు విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) సైతం సోషల్ మీడియా వేదికగా రష్మికకు శుభాకాంక్షలు తెలియజేశారు.రష్మిక మ్యాగజైన్ కవర్ పేజీపై ఉన్నటువంటి ఫోటోని విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది ఇలాగే నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలి అంటూ ఈయన సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వీరిద్దరి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇద్దరు కలిసి వెకేషన్ వెళ్లడం, ఒకే చోట ఉండటం, అలాగే విజయ్ ఇంట్లోనే రష్మిక ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం వంటివి చేయడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలను వీరిద్దరూ ఖండించే ప్రయత్నాలు చేసిన వీరి గురించి ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.తాజాగా విజయ్ దేవరకొండ రష్మికను ప్రశంసిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో మరోసారి వీరి డేటింగ్ రూమర్స్ తెర పైకి వచ్చాయి.







