Nara Lokesh : డిప్యూటీ స్పీకర్ కోలగట్లపై నారా లోకేశ్ ఫైర్
TeluguStop.com
ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి( Kolagatla Veerabhadra Swamy )పై టీడీపీ నేత నారా లోకేశ్ ఫైర్ అయ్యారు.
నియోజకవర్గాన్ని కోలగట్ల అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారని ఆరోపించారు.కోలగట్ల కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్( Real Estate ) పేరుతో నిరుపేదల భూములను లాక్కొని దందాలు చేస్తున్నారని విమర్శించారు.
"""/"/
ప్రభుత్వ భూమిలో పార్టీ కార్యాలయం కడుతున్నారని పేర్కొన్నారు.జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే కోలగట్ల, ఎమ్మెల్సీ అనంతబాబు కలిసి విజయనగరాన్ని గంజాయి అడ్డాగా మార్చేశారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో గంజాయి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రెండు నెలల్లో టీడీపీ - జనసేన ప్రభుత్వం( TDP-Janasena Govt ) వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.