చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ నుంచి యాంటీడ్రాప్ టెక్నాలజీతో హానర్ ఎక్స్ 9బీ( Honor X9B ) స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది.అసలు యాంటీడ్రాప్ టెక్నాలజీ( Anti-Drop Technology ) అంటే ఏమిటో.
ఈ ఫోన్లో ఉండే ఫీచర్లు ఏమిటో తెలుసుకుందాం.
హానర్ ఎక్స్ 9బీ స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం,( Android 13 ) మ్యాజిక్ OS 7.2 తో పనిచేస్తుంది.1.5k రిజల్యూషన్ తో కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే తో వస్తోంది.120Hz రిఫ్రెష్ రేట్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్ తో వస్తుంది.
108 ఎంపీ ప్రధాన కెమెరా, 5ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా తో ఉంటుంది.5800 బ్యాటరీ సామర్థ్యంతో 35w పాస్ట్ చార్జింగ్ కు( 35w Fast Charging ) సపోర్ట్ చేస్తుంది.ఈ ఫోన్ లో NFC, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో ఉంటుంది.
ఈ ఫోన్ 8GB RAM+256GB స్టోరేజ్ తో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.25999 గా ఉంది.ఆరంజ్, సన్ రైజ్, మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్ లలో అందుబాటులో ఉంది.ఐసీఐసీఐ బ్యాంకు కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ.3వేల డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ పొరపాటున చేయి జారి కింద పడితే పెద్దగా డిస్ ప్లే కు( Display ) నష్టం జరగకుండా ఉండేందుకు ఇందులో యాంటీ డ్రాప్ టెక్నాలజీ తీసుకొచ్చారు.
షాక్ అబ్జార్బింగ్ మెటీరియల్ అందించారు.ఈ ఫోన్ 1.5 మీటర్ల పైనుంచి కింద పడిన ఫోన్ కు ఎలాంటి నష్టం జరగదు.యాంటీ డ్రాప్ టెక్నాలజీ అనేది పొరపాటున ఫోన్ కింద పడితే డిస్ ప్లే కు హనీ జరగకుండా సంరక్షిస్తుంది.