ఎవరైనా ఒక షార్ట్ ఫిలిం( Short film ) కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా ? పోనీ అదేదో సినిమా.రిస్క్ తీసుకున్నామంటే అది వేరు.
కేవలం ఏం చేస్తామో తెలియదు… కెరియర్ ఎలా ఉంటుందో అంతకన్నా తెలియదు… కానీ ఏదో ఒకటి చేయాలనే కుతూహలంతో షార్ట్ ఫిలిం చేసేసి దాని కోసం ప్రాణం పోయినంత పని చేసేసాడు దర్శకుడు సుజిత్( Director Sujith ).ఇంతకీ అతను ప్రాణం పోయేంత రిస్కు తీసుకున్న పనేంటో ఒకసారి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.సినిమా ఇండస్ట్రీకి రావాలన్నకు ఆరాటం కొద్ది అంతకన్నా ముందు తన టాలెంట్ ఏంటో ఒకసారి ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు సుజిత్ అలా ఓ షార్ట్ ఫిలిం తీయాలని భావించాడు స్నేహితులందరితో ఈ విషయంపై డిస్కషన్ చేసి అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి మరి ఈ షార్ట్ ఫిలిం షూట్ చేయడం ప్రారంభించారు.

అలా ఒక రోజు రైలు పట్టాలపై ఒక సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉంది ఓవైపు పట్టాలపై కెమెరాతో సుజిత్ నిలబడి షూట్ చేస్తున్నాడు మరోవైపు నటీనటులు నటిస్తున్నారు.ఆ టైంలో పెద్ద బడ్జెట్ ఏం లేదు కాబట్టి సొంతంగా ఎడిటింగ్, షూటింగ్, కెమెరా ( Editing, shooting, camera )వంటి పనులు అన్నీ కూడా చేసేవాడు సుజిత్.మొత్తనికి తీయడం తీస్తున్నాడు కానీ మరోవైపు షార్ట్ జరుగుతున్న సమయంలో రైల్వే ట్రాక్ పైకి రైలు ఎదురుగా వస్తోంది.
అదేమీ పట్టించుకోకుండా సుజిత్ చాలా సీరియస్ గా సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాడు చివరికి ట్రైన్ చాలా దగ్గర వరకు వచ్చింది.సరిగ్గా అదే సమయానికి సన్నివేశం పూర్తయింది.అప్పటికే ట్రైన్ అడుగు దూరంలో ఉండగా అప్పుడు గమనించాడు సుజిత్.

అలా సీన్ పై ఏకాగ్రతతో ట్రైన్ వస్తున్న విషయాన్ని కూడా గమనించకుండా చివరి సెకండ్ లో గుర్తించి పక్కకు దూకేశాడు.లేకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరోతో సినిమా చేసేవాడు కాదు.సాహో ( Saaho )వంటి ఒక పాన్ ఇండియా చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కూడా అతడికి వచ్చుండేది కాదు.
ఇది అతని డెడికేషన్ లెవెల్ కి మరో మెట్టు అని చెప్పుకోవచ్చు.ఇలా సినిమా కోసం ప్రాణాలు ఇచ్చే దర్శకులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.అలాంటి వారిలో సుజిత్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు.







