Allu Arjun : చావు అంచుల వరకు వెళ్లి మరీ పాట షూట్ చేసుకచ్చిన అల్లు అర్జున్ అండ్ టీం

ఎవరైనా ఒక పాట చాలా రిచ్ లేదా అద్భుతంగా రావాలి అంటే ఫోరం లొకేషన్స్ లో షూట్ చేసుకోవచ్చు లేదా మన ఇండియాలోనే ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి ఎక్కడైనా చేసుకోవచ్చు బడ్జెట్ ఎంత ఉంటే అంత గ్రాండ్ ఇయర్ గా పాటని షూట్ చేసుకోవచ్చు.కానీ ఎవరైనా చస్తాము అని తెలిసి కూడా పాట షూట్ చేసుకోవడానికి వెళ్తారా ? మన తెలుగు సినిమా లు అంత రిస్క్ చేస్తారా అంటే కష్టమైన చెప్పాలి.కానీ అల్లు అర్జున్( Allu Arjun ) సరైనోడు సినిమా( Sarinodu movie ) కోసం అలాంటి ఒక రిస్క్ తీసుకున్నారట.కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు సినిమా కోసం హీరో, హీరోయిన్, డైరెక్టర్ తో సహా టీం మొత్తం కూడా ఆక్సిజన్ చాలా తక్కువ ఉండే ఒక ప్రాంతంలో షూట్ చేసి ప్రాణాలకు తెగించి మరీ పని పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చారట.

 Allu Arjun Risk For Sarainodu Movie Song-TeluguStop.com

మరి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం.

Telugu Allu Arjun, Alluarjun, Bolivia America, Oxygen Levels, Rakul Preeth, Sara

అల్లు అర్జున్ మరియు రకుల్ ప్రీత్ నటించిన సరైనోడు సినిమాలో తెలుసా తెలుసా అనే ఒక పాట( telusa telusa song ) ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు అయితే ఆ పాట అద్భుతంగా రావాలని భావించిన అల్లు అరవింద్ ఎంత ఖర్చైనా పర్వాలేదు దాన్ని చాలా గ్రాండ్ ఇయర్ గా ఎవరూ తీయనంత క్వాలిటీ గా తీయాలి అని చెప్పారట.అందుకోసం డైరెక్టర్ ఏకంగా ఇప్పటివరకు ఇండియా లో ఎవరూ ఒక షూట్ చేయని లొకేషన్ ని కన్ఫర్మ్ చేసుకుని మరి వెళ్లి చేసుకోవచ్చాడు.ఇంతకీ ఆ లోకేషన్ ఏంటి అంటే సౌత్ అమెరికా లోని బొలీవియా( Bolivia in South America ).అక్కడ నుంచి 50 గంటల పాటు విమానంలో ప్రయాణం చేస్తే కానీ ఆ బ్యూటిఫుల్ లోకేషన్ రాదు.అంత రిస్క చేసుకుని నాలుగు విమానాల్లో టీం అంతా కూడా అక్కడికి.

Telugu Allu Arjun, Alluarjun, Bolivia America, Oxygen Levels, Rakul Preeth, Sara

తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయని.గట్టిగా మాట్లాడకూడదు వేగంగా నడవకూడదు.ఇక ఈ సాల్ట్ ఫ్లాట్ లొకేషన్ లో కిందంతా ఉప్పు ఉంటుంది ఎవరైనా పొరపాటున జారి కింద పడిన స్కిన్ మొత్తం తెగిపోతుంది.అంత షార్ప్ ఉప్పు పై షూట్ చేశారు.

అలా అయితే తప్ప అక్కడ పని పూర్తి కాదు అని తెలిసి నాలుగు రోజుల పాటు టీమ్ అంతా కూడా అలాంటి సాహసం చేసి తక్కువ ఆక్సిజన్ ఉన్న ఆ ప్రాంతంలోనే షూటింగ్ పూర్తిచేసుకుని ఇండియాకి తిరిగివచ్చారు.ఆ పాట చూస్తే ఇప్పుడు మీకు ఎంత అద్భుతమైన లొకేషన్ లో షూట్ చేశారో మీకు అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube