Nandini Agasara : తినడానికి తిండి లేదు.. ఇంటినిండా మెడల్స్.. నందిని అగసర సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

భారతీయ క్రీడాకారిణిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో నందిని అగసర( Nandini Agasara ) ఒకరు.2022 ఆసియా క్రీడల కొరకు భారత అథ్లెటిక్స్ జట్టులో భాగంగా ఆమె ఎంపికయ్యారు.చైనాలో జరిగిన ఆసియా క్రీడలలో( Asian Games ) పాల్గొని ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.అయితే నందిని అగసర ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో మెడల్స్ ను గెలుచుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది.

 Asian Games Winner Nandini Agasara Inspirational Success Story Details-TeluguStop.com

అయితే నందిని అగసర సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి.

నేను రన్నింగ్ ( Running ) చేయడానికి షూస్ కూడా ఉండేవి కాదని ఆమె తెలిపారు.

డాడీ టీ షాప్ నడిపేవారని అమ్మ ఇళ్లలో పనులు చేసేవారని నందిని అగసర వెల్లడించారు.నేషనల్స్ కు సెలెక్ట్ అయిన సమయంలో అమ్మో నేషనల్సా అని అనుకున్నానని ఆమె వెల్లడించారు.

ఢిల్లీకి( Delhi ) ఎలా వెళ్లాలో కూడా నాకు తెలియదని నందిని అగసర అన్నారు.అప్పటివరకు బస్సు ప్రయాణం తప్ప రైలు ప్రయాణం చేయలేదని ఆమె తెలిపారు.

తిండికి సైతం ఎన్నో ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయని అమ్మతో కలిసి తాను పనులకు వెళ్లానని నందిని అగసర చెప్పుకొచ్చారు.శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ) షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ కాగా ఈ షో ప్రోమోలో నందిని మాట్లాడుతూ ఒకానొక సమయంలో ఒకానొక సమయంలో నాకు గాయాలు అయ్యాయని ఆ సమయంలో తిండి లేక ఇబ్బందులు పడ్డామని నందిని అగసర కామెంట్లు చేశారు.

హైపర్ ఆది( Hyper Adi ) వెంటనే ఇంటినిండా మెడల్స్ కొట్టిన అమ్మాయికి కడుపు నిండా అన్నం పెట్టే పరిస్థితి లేకపోవడం నిజంగా బాధాకరం అని వెల్లడించారు.ఈ ఎపిసోడ్ పేమెంట్ నందినికి ఇస్తామని చెప్పి ఆది, తాగుబోతు రమేష్ మంచి మనస్సు చాటుకున్నారు.ఇంద్రజ సైతం నందినికి తన వంతు సహాయం చేస్తానని కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube