యాదాద్రి భువనగిరి జిల్లా:యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి కొండపైకి ఆటోలు వెళ్లకుండా గత ప్రభుత్వం నిషేధం విధించడంతో సుమారు 300 మంది ఆటో కార్మికులు జీవనోపాధి కరువై రెండేళ్లుగా వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటోలను కొండప్తెకి అనుమతిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల వద్ద ఆటోలను జెండా ఊపి ప్రారంభించి, కొండప్తెకి ఆటోలను అధికారికంగా అనుమతించారు.ఆటోలో జిల్లా అధికారులను ఎక్కించుకొని ఆయన స్వయంగా ఆటో నడుపుతూ కొండపైకి తీసుకెళ్లారు.
ముందుగా ఆలయంలో అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికులు కండిషన్స్ ప్రకారం ఆటోలను గుట్టపైకి సజావుగా,జాగ్రతగా నడుపుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే, డీసీపీ రాజేష్ చంద్ర, ఆలయ ఈఓ రామకృష్ణారావు,అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మున్సిపల్ చ్తెర్మన్ సుధా, కాంగ్రెస్ పార్టీ నాయకులు హేమేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.







