Beetroot Crop : బీట్ రూట్ పంటను ఆశించే పసుపు మచ్చ తెగుళ్లను అరికట్టే పద్ధతులు..!

బీట్ రూట్( Beetroot ) లో పోషకాలు చాలా ఎక్కువ.ముఖ్యంగా రక్తహీనత తో బాధపడుతున్న వారికి బీట్ రూట్ ఒక మంచి ఔషధం.

 Methods To Prevent The Yellow Spot Pest That Expects The Beet Root Crop-TeluguStop.com

కాబట్టి ఈ పంటకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.సారవంతమైన, లోతైన ఇసుక నేలలు ఈ పంట సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి.

అధిక క్షార లక్షణాలు ఉండే చౌడు నేలల్లో కూడా ఈ పంట సాగు చేయవచ్చు.బీట్రూట్ లో మేలు రకం విత్తనాల విషయానికి వస్తే.

ఎర్లి వండర్, రెడ్ బాల్, డెట్రాయిట్ డార్క్ రెడ్ లాంటి రకాలు అధిక దిగుబడి( High yield ) ఇస్తాయి.ఒక ఎకరాకు నాలుగు కిలోల విత్తనాలు అవసరం.

ఆగస్టు నుంచి నవంబర్ వరకు బీట్రూట్ విత్తుకోవచ్చు.మొక్కల మధ్య పది సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.గింజలు మొలకెత్తిన తర్వాత ఒక్కొక్క సీడ్ బాల్ నుండి దాదాపుగా 5 లేదా 6 మొలకలు వస్తాయి.ఒక బలమైన మొలక ఉంచి మిగిలినవి పీకేయాలి.

విత్తనం నాటిన వెంటనే ఒక నీటి తడి ఇవ్వాలి.నీటిని డ్రిప్ విధానం( Drip method ) ద్వారా అందిస్తే కలుపు సమస్య ఎక్కువగా ఉండదు.ఇక బీట్రూట్ పంటకు చీడపీడల, తెగుళ్ల బెడద చాలా ఎక్కువ.ముఖ్యంగా పసుపు పచ్చ తెగుళ్లు ఆశిస్తే జీవన నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.కాబట్టి బీట్రూట్ విత్తనాలను రెండు గ్రాముల కాప్టాన్ తో విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాలి.ఈ తెగుళ్లు పంట పొలంలో గుర్తించిన తర్వాత రెండు గ్రాముల డైథేనెజ్డ్-78 ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ఈ తెగుళ్ల కోసం పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ తొలిదశలోనే అరికడితే పంట సంరక్షించబడి అధిక దిగుబడి పొందవచ్చు.పంట విత్తిన మూడు నెలలకు చేతికి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube