90s అని వెబ్ సిరీస్( 90s web series ) ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వారిలో నటుడు మౌళి( Mouli ) ఒకరు.ఈ సిరీస్ ద్వారా తన నటనతో అందరిని మెప్పించినటువంటి ఈయన తాజాగా ఒక స్టేజ్ పై కామెడీ పండిస్తున్నటువంటి నేపథ్యంలో చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున వివాదంగా మారాయి.
దీంతో భారీగా ఈయన ట్రోల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.ఒక స్టేజ్ మీద కామెడీని పండిస్తూ తన అరచేతిని మూసి తెరిచారు ఇందులో ఒకటి మాయమైందని అది ఏంటో కనుక్కోమని చెప్పారు.

నా అరిచేతి నుంచి మాయమైనది ఏపీ క్యాపిటల్ ( Ap Capital ) అంటే అది ఎక్కడ వెతికిన మీకు దొరకదు అంటూ ఈ సందర్భంగా మౌళి రాజధాని గురించి చేసినటువంటి ఈ కామెడీ కాస్త రివర్స్ అయ్యింది.దీంతో టీడీపీ శ్రేణులు ఇలా కుర్రాళ్ల చేత కూడా చివరికి కామెడీ చేసే పరిస్థితికి వైసిపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకువచ్చింది అంటూ కామెంట్ లు చేశారు.దీంతో వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యి మౌళి పట్ల భారీ స్థాయిలో విమర్శలు కురిపించారు.

ఈ విధంగా తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పట్ల ఈ అన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు.ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా మౌళి స్పందిస్తూ.నన్ను క్షమించండి నేను వేసినటువంటి ఒక జోక్ నెగిటివిటీ అవుతుంది నేను ఈ వ్యాఖ్యలను ఎలాంటి రాజకీయాలను ఉద్దేశించి చేయలేదని వేరే వారికి మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో చేయలేదని తెలిపారు.
ఎవరైనా నా మాటలతో బాధపడి ఉంటే దయచేసి నన్ను క్షమించండి ఈ విషయంలో మా అమ్మ నాన్నలను లాగకండి అంటూ ఈయన చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.







