తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా పలు సినిమాలలో నటిస్తూ ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తున్నటువంటి వారిలో వర్ష బొల్లమ్మ( Varsha Bollamma ) ఒకరు.ఇవే ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఇప్పటికే వర్ష చూసి చూడంగానే, జాను, మిడిల్ క్లాస్ మెలోడిస్, పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం వంటి సినిమాలలో నటిస్తున్నారు.ఇక త్వరలోనే ఊరి పేరు భైరవకోన( Ooruperu Bhairavakona ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్( Sandeep Kishan ) హీరోగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 16న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది.
![Telugu Ooruperu, Swathi Muthyam, Tollywood, Varsha Bollamma-Movie Telugu Ooruperu, Swathi Muthyam, Tollywood, Varsha Bollamma-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/02/Varsha-bollamma-react-on-marriage-rumours-with-Bellamkonda-Ganesh-detailsd.jpg)
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి వర్ష వరస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు అయితే ఇటీవల ఈమె బెల్లంకొండ గణేష్( Bellamkonda Ganesh ) తో కలిసి నటించిన స్వాతి ముత్యం సినిమా( Swathi Muthyam ) సమయంలో వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఆ హీరోతో కలిసి ఈమె ఏడడుగులు నడవ బోతున్నారు అంటూ వీరి రిలేషన్ గురించి వార్తలు వచ్చాయి.తాజాగా ఈ వార్తలపై వర్ష స్పందించి క్లారిటీ ఇచ్చారు.
![Telugu Ooruperu, Swathi Muthyam, Tollywood, Varsha Bollamma-Movie Telugu Ooruperu, Swathi Muthyam, Tollywood, Varsha Bollamma-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/02/Varsha-bollamma-react-on-marriage-rumours-with-Bellamkonda-Ganesh-detailss.jpg)
నేను గణేష్ కలిసి బయట తిరగడం సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు మరొకరు రిప్లై ఇవ్వడం వంటి సందర్భాలు కనుక మా ఇద్దరి మధ్య జరిగి ఉంటే మీరు అనుకున్నట్టు మేము ప్రేమలో ఉన్నామన్న అర్థం ఉంటుంది కానీ మా ఇద్దరి మధ్య ఇలాంటివి ఎప్పుడూ కూడా జరగలేదు.అయినప్పటికీ మేమిద్దరం ప్రేమలో ఉన్నామని పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ వార్తలు రావడం చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యానని ఈమె తెలిపారు.నిజం చెప్పాలంటే అతను గుడ్ పర్సన్, గుడ్ ఫ్రెండ్స్ అంతే.కానీ మా మధ్య ఇలాంటి రూమర్ విని షాక్ అయ్యాను.ఆ తర్వాత దానికి కరెక్ట్ గా రిప్లై కూడా ఇచ్చానని తెలిపారు.