తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఉంది.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా వరుసగా సక్సెస్ లు సాధించడంతో ఇక ఇప్పుడు ఆయన ఎవరితో సినిమా చేస్తున్నాడు అనే డౌట్ మాత్రం అందరికీ ఉంది.
ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఆయన బాలకృష్ణతో భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) అనే సినిమా చేశాడు.ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో నెక్స్ట్ చిరంజీవితో సినిమా ఉంటుంది అంటూ చాలా వార్తలు వచ్చాయి.
అయినప్పటికీ చిరంజీవితో సినిమా లేదు అనేది కొద్ది రోజుల క్రితం చాలా స్పష్టంగా తెలిసిపోయింది.

ఇక ఇప్పుడు అందుకే అనిల్ రావిపూడి వెంకటేష్( Venkatesh ) ని హీరోగా పెట్టీ దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఐదు సినిమాలకి దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.ఇక ఇప్పటికే వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఎఫ్ 2, ఎఫ్ 3 అనే సినిమాలు వచ్చాయి.
ఇక ఈ రెండు సినిమాలకి దిల్ రాజు( Dil Raju ) నిర్మాతగా వ్యవహరించాడు.ఇక ఇప్పుడు కూడా వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమాగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అంటూ సోషల్ మీడియా వేదికగా చాలామంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

నిజానికి ఈ సినిమాతో కనక అనిల్ రావిపూడి సక్సెస్ అందుకుంటే వరుసగా ఎనిమిది సినిమాలతో సక్సెస్ లను అందుకున్న డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంటాడు.మరి ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.







