తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలామంది నటులు ఇండస్ట్రీ లో ఒక సక్సెస్ వస్తే చాలు అంటూ చాలా సంవత్సరాల పాటు ఎదురు చూస్తూ ఉంటారు.మరి ఇలాంటి క్రమంలోనే చిరంజీవి( Chiranjeevi ) తనదైన రీతిలో 40 సంవత్సరాలపాటు ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతూ వస్తున్నారు అంటే మామూలు విషయం కాదు.
ఆయన చేసిన సినిమాలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చేయలేరని చెప్పాలి.ఇక ఇప్పుడు విశ్వంభర( Vishwambhara ) అనే సినిమాలో నటిస్తున్న చిరంజీవి.
ఈ సినిమాతో పాటుగా ఆయన హరీష్ శంకర్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు అంటు వార్తలైతే వస్తున్నాయి.మరి ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ఎవరు సమకూర్చారు అనే వార్తలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి.

ఒక రకంగా చెప్పాలంటే బివిఎస్ రవి( BVS Ravi ) ఒక కథని చిరంజీవి కి వినిపించాడు.ఆ కథ నచ్చిన చిరంజీవి ఆ సినిమాకి హరీష్ శంకర్ ని డైరెక్టర్ గా తీసుకోవాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి.ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ తో ‘ బ్రో డాడి ‘ అనే సినిమాకు మార్పులు చేర్పులు చేస్తూ ఒక కథని రాయించాడు.

కాబట్టి ఈ సినిమా స్టోరీ తో హరీష్ శంకర్( Harish Shankar ) చిరంజీవి సినిమా చేయబోతున్నాడు అంటూ మరికొన్ని వార్తలైతే వస్తున్నాయి.మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు కాకుండా హరీష్ శంకర్ తన దగ్గర ఉన్న కొత్త స్టోరీ తో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.మరి మొత్తానికైతే ఈ మూడు వార్తల్లో ఏ వార్త నిజమైందో తెలియాలంటే హరీష్ శంకర్ గానీ, చిరంజీవి గానీ స్పందిచాల్సి ఉంది…
.







