Poonam Kaur : అరుదైన వ్యాధితో బాధ పడుతున్న పూనమ్ కౌర్.. అలాంటి దుస్తులు ధరించలేక ఇబ్బంది పడ్డానంటూ?

టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రముఖ నటి పూనమ్ కౌర్( Poonam Kaur ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఒకప్పుడు సినిమాలలో ఈమె హీరోయిన్ గా నటించిన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Poonam Kaur Reveals Her Health Problem-TeluguStop.com

ఆ తర్వాత ఈమె రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.ప్రస్తుతం అడపాదనప సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

Telugu Bollywood, Fibromyalgia, Problem, Poonam Kaur, Tollywood-Movie

కాగా ఈమె సినిమాలకు సంబంధించిన విషయాలు కంటే ఎక్కువగా కాంట్రవర్సీలకు సంబంధించిన విషయాల్లోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన విషయాలలో తల దూరుస్తూ కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా ట్వీట్స్ చేస్తూ ఉంటుంది పూనమ్ కౌర్.ఇలా ఉంటే ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ విషయంతో వార్తలు నిలిచే పూనమ్ కౌర్ హెల్త్ కండిషన్ అంతా బాగోలేదట.

Telugu Bollywood, Fibromyalgia, Problem, Poonam Kaur, Tollywood-Movie

మరి ఇంతకీ ఈ పూనమ్ కి ఏం జరిగింది అన్న విషయానికి వస్తే.గతంలో తను తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడిన విషయాన్ని బయటపెట్టింది.పూనమ్ కౌర్ గతంలో ఫైబ్రోమయాల్జియా( Fibromyalgia ) అనే సమస్యతో బాధపడిందట.

Telugu Bollywood, Fibromyalgia, Problem, Poonam Kaur, Tollywood-Movie

ఇది కూడా ఓ రకమైన మయోసైటిస్ లాంటిదే.ఫైబ్రోమయాల్జియా బాధితులు తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు.శరీరం నిస్సత్తువుగా మారుతుంది.అలసటతో పాటు నిద్రలేమితో బాధపడతారు.ఈ సమస్యతో తను చాన్నాళ్లు బాధపడినట్టు వెల్లడించింది పూనమ్ కౌర్.చేతులు, కాళ్లు పట్టేసేవని, టైట్ గా ఉండే దుస్తులు ధరించలేక, దాదాపు రెండేళ్ల పాటు వదులుగా ఉండే దుస్తులు మాత్రమే ధరించాల్సి వచ్చిందని వెల్లడించింది.

అలా చాన్నాళ్లు బాధపడిన తర్వాత నేచురోపతిలో పేరుగాంచిన మంతెన సత్యనారాయణ( Manthena Satyanarayana )ను కలిశానని, ఆయనిచ్చిన సలహాలు తనకు బాగా ఉపయోగపడ్డాయని చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube