ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఐఏఎస్( IAS ) సాధించడం సులువు కాదనే సంగతి తెలిసిందే.అయితే ఇద్దరు అక్కాచెల్లెళ్లు మాత్రం ఒకే స్కూల్, ఒకే కాలేజ్ లో కలిసి చదువుకున్నారు.
ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఐఏఎస్ కావాలనే లక్ష్యాన్ని సాధించడం ద్వారా వార్తల్లో నిలవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.ఒకే నోట్స్ చదివి యూపీఎస్సీకి( UPSC ) సిద్ధమైన ఈ యువతులలో ఒకరు 3వ ర్యాంక్ సాధించగా మరొకరు 21వ ర్యాంక్ సాధించారు.
ఈ ఇద్దరు ఆక్కాచెల్లెళ్ల పేర్లు అంకితా జైన్,( Ankita Jain ) వైశాలి జైన్( Vaishali Jain ) కావడం గమనార్హం.యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే సమయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకున్న ఈ అక్కాచెల్లెళ్లు యూపీఎస్సీ పరీక్ష కఠినమైన పరీక్ష అని చెబుతున్నారు.
అంకితా జైన్ నాలుగో ప్రయత్నంలో యూపీఎస్సీ లక్ష్యాన్ని సాధించడం జరిగింది.ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చదివిన అంకితా జైన్ ఆ తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ సాధించారు.

అక్క అంకితా జైన్ ఇచ్చిన సలహాలు, సూచనలు అంకితా జైన్ కు ఎంతగానో ఉపయోగపడ్డాయి.వైశాలి జైన్ ఒకవైపు జాబ్ చేస్తూనే మరోవైపు యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేరై సత్తా చాటారు.అంకితా జైన్, వైశాలి జైన్ సక్సెస్ స్టోరీ( Success Story ) ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.అంకితా జైన్, వైశాలి జైన్ కెరీర్ పరంగా మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అంకితా జైన్, వైశాలి జైన్ కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం కెరీర్ పరంగా తిరుగుండదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రాబోయే రోజుల్లో ఐఏఎస్ లక్ష్యాన్ని సాధించిన ఈ యువతులు మరింత ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అంకితా జైన్, వైశాలి జైన్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.







