కొన్ని కంపెనీలు ఉద్యోగుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాయి.ఎన్నో ఏళ్లుగా ఎంతో నిజాయితీ పనిచేసినా చివరికి ప్రతిఫలం ఇవ్వకపోగా, అర్ధాంతరంగా ఉద్యోగాల నుంచి తీసేస్తాయి.
చిన్న కారణాలకు కూడా కొన్ని కంపెనీలు ఏళ్ల తరబడి పనిచేసిన ఉద్యోగులను తీసేసిన సందర్భాలు ఉన్నాయి.తాజాగా కంపెనీలు ఎంత కఠినంగా వ్యవహరిస్తాయో తెలిపే మరొక ఘటన చోటుచేసుకుంది.
తాజాగా టిక్‌టాక్ వీడియో ( Tiktok video )కారణంగా ఒక అమెజాన్ ఉద్యోగి జాబ్ కోల్పోయాడు.
అతను తమాషాగా భారీ వస్తువులను ఆర్డర్ చేయడం మానేయాలని కస్టమర్లను కోరుతూ వీడియో చేశాడు.టిక్‌టాక్‌లో చాలా మంది అతని వీడియోను చూసి దాన్ని వైరల్ చేశారు.దీంతో అమెజాన్ అతడిని తొలగించింది.
అమెజాన్‌లో ఏడేళ్లు పనిచేశానని, చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఉంటే బాగుండేదని, ఉన్నపళంగా ఇలా ఉద్యోగం నుంచి తీసేయడం చాలా బాధగా ఉందని సదరు ఉద్యోగి తన బాధను వెల్లబోసుకున్నాడు.ఆ ఉద్యోగి పేరు కెండాల్.
అతడి టిక్‌టాక్ యూజర్ పేరు @thatamazonguyy.అమెజాన్ వర్క్ గురించి వీడియోలు చేసేవాడు.
న్యూయార్క్( New York ) పోస్ట్ ప్రకారం, డిసెంబరు 6న ఓ వీడియోను అతను పోస్ట్ చేశాడు.ఆ వీడియోనే అతడి కొంప ముంచింది.
ఆ వీడియోకు టైటిల్ “అమెజాన్‌లో భారీ వస్తువులను కొనడం ఆపండి”.అని అతడు పెట్టాడు.
కెండాల్ ఉద్యోగం నుంచి తొలగించాక మరో వీడియో చేశాడు.అమెజాన్( Amazon ) తనను తొలగించిందని, ఈ సంస్థలోనే తన ఏడేళ్లు అలానే గడిచిపోయాయని, తాను నాలుగు వారాల క్రితం ఒక వీడియో చేసానని చెప్పాడు.”ప్రజలు అమెజాన్ నుంచి భారీ వస్తువులను కొనడం మానేయాలని నేను చెప్పాను.నేను అమెజాన్ కార్మికుడిని, నాకు బరువైన వస్తువులను ఎత్తడం ఇష్టం లేదు కాబట్టి చెప్పాను.
చాలా మంది దానిని తమాషాగా భావించారు.కానీ కొంతమందికి నచ్చలేదు.
సారీ ఆ వీడియో వల్ల మీకు కోపం లేదా బాధ కలిగి ఉంటే, క్షమించాలి.ఎవరినీ కోప్పడాలని, ఎవరినీ బాధపెట్టాలని అనుకోకూడదు.
నేను ఫన్నీ వీడియో చేయాలనుకున్నాను.అది నిజం.
నేను నా ఉద్యోగాన్ని కోల్పోయాను, నేను అమెజాన్‌లో మళ్లీ పని చేయలేను.దయచేసి నన్ను క్షమించండి” అని న్యూయార్క్ పోస్ట్ అతని క్షమాపణ గురించి కూడా రాసింది.