జనవరి 22న అయోధ్యలో( Ayodhya ) పవిత్ర ఆలయమైన రామమందిరాన్ని( Ram Mandir ) ప్రారంభించేందుకు భారతదేశం ఎదురుచూస్తోంది.లక్షల మంది ప్రజలు రాముడి ఆలయం ప్రారంభోత్సవాన్ని చూడాలని కూతుహల పడుతున్నారు.
హిందువులు ఉన్న ప్రపంచ దేశాలు కూడా ఈ ఓపెనింగ్ ఈవెంట్‌ను సెలెబ్రేట్ చేసుకున్నాయి.
ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్‌లోని( West Bengal ) దుర్గాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆలయానికి ప్రత్యేక నివాళులర్పించాడు.
అతని పేరు ఛోటాన్ ఘోష్,( Chhotan Ghosh ) అతను ఆలయాన్ని పోలిన చిన్న మోడల్ తయారు చేయడానికి ఏకంగా 20 కిలోల పార్లే-జి బిస్కెట్లను( Parle G Biscuits ) ఉపయోగించాడు.మోడల్ 4×4 అడుగుల పరిమాణంలో ఉంది.
పార్లే-జి బిస్కెట్లతో తయారు చేసిన ఈ రామమందిరం ఛోటాన్ ఆర్టిస్టిక్ స్కిల్స్ చూపిస్తుంది.అతను మోడల్‌ను ఎలా తయారు చేసాడో చూపించే ఓ వీడియోను కూడా షేర్ చేశాడు.
ఈ వీడియో ఇంటర్నెట్‌లో బాగా పాపులర్ అయింది.

ఘోష్ అద్భుతమైన ప్రతిరూపాలు చేయడం ఇదే మొదటిసారి కాదు.గతంలో ఇస్రో అంతరిక్ష యాత్ర అయిన చంద్రయాన్-3( Chandrayaan-3 ) మోడల్‌ను కూడా తయారు చేశాడు.అతని నమూనా కేవలం బొమ్మ కాదు; అది గాలిలో 30 అడుగుల వరకు ఎగరగలిగే రాకెట్‌ను కలిగి ఉంది.

“పార్లే జి బిస్కెట్‌లతో చేసిన రామమందిరం.భారతదేశంలో ఇలాంటి ప్రతిభావంతులైన కళాకారులు ఎందరో ఉన్నారు.జై శ్రీ రామ్.” అని ఆ వీడియోకు క్యాప్షన్ జోడించారు.చాలా మంది ఈ వీడియోను చూసి వావ్ అంటున్నారు, వారు దీన్ని లైక్ చేసారు, “ఎంత గొప్ప ప్రతిభ, సోదరా.” అంటూ ప్రశంసలు కురిపించారు.మరొకరు “అద్భుతం” అన్నారు.మీరు కూడా వీడియోను చూడండి.ఇకపోతే జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) ఆలయాన్ని తెరవనున్నారు.జనవరి 16న ప్రారంభమైన ప్రత్యేక కార్యక్రమంతో ఆలయాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు.







