వందే భారత్ ట్రైన్‌లో లగేజీ స్పేస్‌ విషయంలో గొడవ.. వీడియో వైరల్...

ఈరోజుల్లో మెట్రో నుంచి వందేభారత్ ట్రైన్‌ల( Vande Bharat Train ) వరకు అన్ని రైళ్లలో గొడవలు జరుగుతున్నాయి.సీట్ల విషయంలో ప్రజలు ఒకరికొకరు కొట్టేసుకుంటున్నారు.

 Viral Video Two Passengers Fight Over Luggage Space Inside Vande Bharat Train De-TeluguStop.com

వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ షాక్ ఇస్తున్నాయి.తాజాగా మరో వీడియో వైరల్ గా మారింది.

వందేభారత్ ట్రైన్‌లో లగేజీ స్పేస్( Luggage Space ) విషయంలో ఇద్దరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.వారి గొడవ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఎక్స్ ప్లాట్‌ఫామ్ అకౌంట్ “ఘర్ కే కలేష్” వీడియోను షేర్ చేసింది.

ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు బిగ్గరగా అరుస్తుండగా, ఇతర ప్రయాణికులు( Passengers ) ఆందోళనగా వారిని చూస్తున్నట్లు వీడియోలో మనం చూడవచ్చు.పరిమిత స్థలం, వారి బ్యాగ్‌ల ప్లేస్‌మెంట్ గురించి పాసింజర్లు అసహనం వ్యక్తం చేస్తూ గొడవ పడ్డారు.ఒక మహిళ కూడా వాదనకు దిగింది, పురుషులలో ఒకరిపై అరుస్తుంది.

కొంతమంది కో-పాసింజర్లు వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించినా వారు ఆగడం లేదు.తరువాత, రైల్వే పోలీసు అధికారి( Railway Police ) సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.రైలు అయినా, బస్సు అయినా, విమానం అయినా ప్రజా రవాణాలో ఇలాంటి గొడవలు సర్వసాధారణమని వారిలో కొందరు అన్నారు.భారతీయులు ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవ పెట్టుకోవడానికి ఏదో ఒక కారణం వెతుకుతారని చెప్పారు.“విమానాలు రైళ్లుగా మారాయి.రైళ్లు బస్సులుగా మారాయి.” అని ఇంకొందరు అన్నారు, “వందే భారత్ రైళ్లలో ఇది చాలా సాధారణం.నేను ప్రయాణించినప్పుడల్లా బ్యాగ్ స్పేస్ కోసం ఎవరో ఒకరు గొడవ పడుతూ ఉంటారు.” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube