రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పక్షం రోజుల క్రితం హరిత ప్రేమికుడు దుంపెన రమేష్ ఇంటి వెనుకాల నాటిన చెట్టును రఫిక్ అనే వ్యక్తి నరికి వేశాడు.“చెట్టును నరికిన ప్రబుద్ధుడిపై గ్రామపంచాయతీ సిబ్బంది పదివేల జరిమానా విధిస్తూ రిసిప్టును చెట్టు నరికిన వ్యక్తికి అందజేశాడు.చెట్లు నరికితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.రఫిక్ ను వివరణ కోరగా వైర్లు అడ్డుగా ఉన్నాయని చెట్టు కొమ్మలు నరకమంటే చెట్టు మొదలును తన సిబ్బంది నరికి వేశారని అన్నారు.
మరోసారి ఈ విధంగా కాకుండా చూసుకుంటానని అన్నారు.







