సాహిత్య సృజన అంశంపై కార్యశాల కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా :జనవరి 11 నాడు ఎల్లారెడ్డిపేట హైస్కూల్ నందు, ప్రాణహిత ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, విద్యార్థులకు సాహిత్య సృజన అంశంపై కార్యశాల ను నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి స్థానిక హెడ్మాస్టర్ శ్రీ డి.

 Workshop Program On Literary Creation , Literary Creation, Workshop Program, Edu-TeluguStop.com

హనుమాన్లు అధ్యక్షత వహించగా, పాఠశాల ఉపాధ్యాయ బృందం, ప్రాణహిత ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.ప్రాణహిత ట్రస్ట్ బాధ్యులు కే .రమణ, ట్రస్ట్ యొక్క కార్యక్రమాలను, ఉద్దేశాలను వివరించారు.పిల్లలకు సంబంధించిన, సృజనాత్మక శక్తుల్ని వెలికి తీయడానికి, వారిలో ఉన్న సాహితీ సృజనను మరింత పదును పెట్టడానికి, ప్రముఖ బాల సాహితీవేత్త డాక్టర్ వి ఆర్ శర్మ మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న తెలివిని, జ్ఞానాన్ని పదును పెట్టాలంటే, వారిని స్వేచ్ఛగా మాట్లాడనివ్వాలి.

ప్రశ్నించడం నేర్పాలి.అప్పుడు మాత్రమే పిల్లలు నిర్భయంగా వివిధ సబ్జెక్టులు నేర్చుకోవడం గాని, కథలు పాటలు చెప్పడం గాని చేస్తారని, వారి కుటుంబంలో, సమాజంలో అనేక ఘటనలను యూటన్ కిస్తూ, వివిధ రచనలు కూడా చేసే సత్తా ఉంటుందని, డాక్టర్ శర్మ గారు తెలిపారు.

మరొక అతిథి, కే శ్యామ్ రావు, రిటైర్డ్ లెక్చరర్ మాట్లాడుతూ, ఆంగ్ల భాష అంటే అనేక మంది పిల్లలకు భయం, బిడియం ఉంటుందని, ఇదొక తర్కం లేని భాషని, కానీ సులువుగా పిల్లలు తమ మాతృభాషలో పట్టు సాధించడం ద్వారా ఆంగ్ల ఆంగ్లం పట్ల ఆసక్తిని పెంచుకోవచ్చని, ఆంగ్ల భాషలో అనేక మెళుకువలను తెలిపారు.రిటైర్డ్ హెడ్మాస్టర్ కందుకూరిశ్రీనివాస్, రిటైర్డ్ టీచర్ పి అంజయ్య మాట్లాడారు.

ప్రాణహిత ట్రస్ట్ పక్షాన మోతి దేవి రెడ్డి, మద్దికుంట లక్ష్మణ్ ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, లింగాల సుదర్శన్, నలిమెలసత్యనారాయణ, బొమ్మకంటి రమేష్, టి సుధాకర్ రావు, జేపీ అశోక్ కుమార్ లు పాల్గొన్నారు.ట్రస్టు ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఈ పాఠశాల పిల్లలకు ఇలాగే ప్రతి సంవత్సరం కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube