భారతదేశం స్టార్టప్ క్యాపిటల్ బెంగళూరు( Bengaluru ) ఇటీవల అనేక ఇంటర్నెట్ మీమ్‌లకు కేంద్రంగా మారింది.ఈ మీమ్‌లు( Memes ) ఈ సిటీలో మాత్రమే జరిగే ఫన్నీ సంఘటనలను వెలుగులోకి తెస్తాయి.
నగరంలో మాత్రమే జరిగే వెరైటీ ఇన్నోవేటివ్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడడానికి నగరవాసులు “పీక్ బెంగళూరు” అనే పదం తెగ వాడేస్తున్నారు.ఆ “పీక్ బెంగళూరు” మూమెంట్స్‌లో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్( Ola CEO Bhavish Aggarwal ) మరొక మూమెంట్ షేర్ చేశారు.
సిటీలో ప్రజలు ఎంత సెటైరికల్ గా ఉంటారు చూపించే ఫోటోను ఆయన పంచుకున్నారు.
ఈ ఫొటోలో డంకిన్ డోనట్స్ స్టోర్ పైన ఉన్న షుగర్.ఫిట్( Sugar.Fit ) అనే పేరుగల డయాబెటిస్ రివర్సల్ క్లినిక్ కనిపించింది.
అగర్వాల్ ఈ ఫోటోకు “రియల్ సర్కులర్ ఎకానమీ” అని క్యాప్షన్ ఇచ్చారు, దానితో పాటు నవ్వుతూ, కన్ను కొట్టే ఎమోజీలు కామెంట్ చేశారు.డోనట్ స్టోర్‌కి( Donuts Store ) వెళ్లి షుగరీ ఐటమ్స్ తింటే మధుమేహం జబ్బు( Diabetes ) వచ్చే ఛాన్స్ ఎక్కువ.
అప్పుడు, డయాబెటిస్ రివర్సల్ క్లినిక్‌కి వెళ్లక తప్పదు.అయితే ఈ స్టోర్‌కి వెళ్లిన వారికి డయాబెటిస్ వస్తుందని, వారి కోసమే ఈ స్టోర్ పైన డయాబెటిస్ రివర్సల్ సెంటర్ పెట్టినట్లు ఉందని పరోక్షంగా ఓలా సీఈవో జోక్ చేశారు.
ఓలా సీఈఓ పోస్ట్ వైరల్ అయ్యింది, నెటిజన్ల నుంచి నవ్వులు, ఎమోజీల వరద వచ్చింది.“అవును! షుగర్ టు షుగర్ ఫిట్ ఇప్పుడు సాధ్యమవుతుంది” అని సమాధానమిస్తూ డయాబెటిస్ సెంటర్ కూడా ఈ పోస్ట్ పై సెటైర్ పేల్చింది.దీన్ని చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.ఈ ఫోటో పై మీరు కూడా ఒక లుక్కెయ్యండి.