ఏపీకి వైఎస్ షర్మిల రాక వలన తమకు ఎలాంటి ఎఫెక్ట్ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.రాజకీయ పార్టీల్లో మార్పు సహాజమని పేర్కొన్నారు.
రాజకీయ ప్రక్రియలో భాగంగానే తమ పార్టీలో సమన్వయకర్తల మార్పు జరుగుతోందని మంత్రి బొత్స తెలిపారు.ఎన్నికల సమయంలో ఇంఛార్జ్ ల మార్పు అనేది ప్రతి పార్టీలో ఉంటుందని చెప్పారు.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబులా తాము ప్రజలను మోసం చేయలేదని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఏపీలో మరోసారి జగనే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు.
అలాగే అంగన్వాడీలతో పాటు సమ్మెలో ఉన్న ఉద్యోగులతో చర్చిస్తున్నామన్నారు.చర్చల్లో భాగంగా కొన్ని హామీలను నెరవేర్చలేని పరిస్థితి ఉందని తెలిపారు.







