భారత సంతతి పారిశ్రామికవేత్తను వరించిన కెనడా అత్యున్నత పురస్కారం

భారత సంతతికి చెందిన ఫిర్దౌస్ ఖరస్‌ను( Firdaus Kharas ) కెనడా అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘‘ ఆర్డర్ ఆఫ్ కెనడా ’’( Order of Canada ) వరించింది.మానవ కేంద్రీకృత మీడియా ద్వారా సామాజిక సేవ చేసినందుకు ఈ పురస్కారం దక్కింది.

 Indian-born Entrepreneur Firdaus Kharas Gets One Of Canadas Highest Honours Deta-TeluguStop.com

ఆర్డర్ ఆఫ్ కెనడా 2023 నియామకాల వార్షిక జాబితాను కెనడా గవర్నర్ జనరల్ మేరీ సైమన్( Mary Simon ) గురువారం విడుదల చేశారు.ఆర్డర్ ఆఫ్ కెనడా .దేశ అత్యున్నత గౌరవాలలో ఒకటి.కెనడాకు( Canada ) అసాధారణమైన , నిరంతర సహకారాలు అందించిన సమాజంలోని అన్ని రంగాలలోని వ్యక్తులను సత్కరించేందుకు ఉద్దేశించారు.

ఆర్డర్ ఆఫ్ కెనడాను 74 మంది అధికారులకు ప్రకటించింది సైమన్ కార్యాలయం.

Telugu Canada, Canadas Honours, Chocolate Moose, Firdaus Kharas, Firdauskharas,

68 ఏళ్ల ఖరస్ సామాజిక వ్యవస్ధాపకుడిగా, మాస్ కమ్యూనికేషన్స్ మీడియా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ క్రమంలోనే ఆయనకు ఆర్డర్ ఆఫ్ కెనడా పురస్కారం వరించింది.దీనిపై ఖరస్ స్పందించారు.

ఈ అత్యున్నత గౌరవాన్ని స్వీకరించడం తనను కదిలించిందని, వలసదారునిగా తనకు ఇది అర్ధవంతమైనదని ఖరస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఉన్నత స్థాయి సాధించిన కమ్యూనిటీ అయినప్పటికీ పార్సీలు( Parsis ) కెనడాలో 3,600 మంది మాత్రమే వుండి మైనారిటీ తరగతిలో వున్నారని , అందువల్ల ఈ విధమైన గుర్తింపు సంతృప్తికరంగా వుందని ఖరాస్ తెలిపారు.

Telugu Canada, Canadas Honours, Chocolate Moose, Firdaus Kharas, Firdauskharas,

ఆర్డర్ ఆఫ్ కెనడా పురస్కారం పొందిన వారికి త్వరలోనే అవార్డులను ప్రధానం చేయనున్నారు.దీనికి సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.ఖరస్ 1995లో చాక్లెట్ మూస్ మీడియాను( Chocolate Moose Media ) స్థాపించారు.ఇది మానవ స్థితిని మెరుగుపరిచేందుకు మాస్ కమ్యూనికేషన్‌లను రూపొందించడానికి ఏర్పడిన ఓ సామాజిక సంస్థ.

ఆయన చర్య భారత్‌తో పాటు 198 దేశాలలో అనేక భాషలలో ఉపయోగించబడింది.ఈ క్రమంలో ఖరస్.ప్రతిష్టాత్మక పీబాడీ అవార్డ్ సహా పలు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు సహా 125 పురస్కారాలను అందుకున్నారు.ఖరస్‌కు అవార్డ్ దక్కడంపై కెనడాలోని భారతీయ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేసింది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube