హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది.కుల్సుంపురాలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
ఓ వ్యక్తిని హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని చెత్తలో పడేసి నిప్పుబెట్టారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇందులో భాగంగా వ్యక్తిని బయట ఎక్కడో హత్య చేసి డబ్బాలో తీసుకువచ్చారని పోలీసులు గుర్తించారు.
అనంతరం మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు నిప్పు బెట్టారని ప్రాథమికంగా నిర్ధారించారు.అలాగే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గాలిస్తున్నారు.







