ఈ రోజుల్లో మైనర్లు రోడ్ల మీదకి బైకులు కార్లు వేసుకొని వచ్చేస్తున్నారు.సరిగా డ్రైవింగ్ కూడా రాని ఆ పిల్లలు పెద్దా పొరపాటు చేస్తూ చివరికి తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు ఇతరుల ప్రాణాలను కూడా రిస్కులు పడేస్తున్నారు.
తాజాగా ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లో( Delhi Shalimar Bagh ) గ్యాస్ సిలిండర్లతో కూడిన రిక్షాను( Rickshaw ) ఒక మైనర్ కారు నడుపుతూ ఢీకొట్టాడు.ఈ ఢీకొట్టిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
వైరల్ వీడియోలో, ఓ మైనర్ బాలుడు నడుపుతున్న కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న రిక్షాను ఢీకొట్టినట్లు కనిపించింది.దీని ప్రభావం వల్ల సిలిండర్లు గాలిలో ఎగిరి కిందపడ్డాయి, అయితే అదృష్టవశాత్తూ అవి పేలలేదు.
ఢీకొట్టిన తరువాత రిక్షాతో పాటు రిక్షా పుల్లర్ ముందుకు పడిపోవడం కూడా వీడియోలో మనం చూడవచ్చు.రిక్షా పార్క్ చేసి ఉన్న మరొక కారణం అనుకుంటూ ముందుకు కదిలింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

నివేదికల ప్రకారం, కారు డ్రైవర్( Car Driver ) మొదటగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లి, ఆమె 6 ఏళ్ల కుమార్తెను ఢీకొట్టాడు.దాంతో బాగా భయపడ్డాడు.ఆ భయం లో వేగంగా దూసుకెళ్తూ మరోసారి యాక్సిడెంట్( Accident ) చేశాడు.
ఈసారి కూడా సంఘటన స్థలం నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ సిలిండర్లతో( Gas Cylinders ) నిండిన రిక్షాను ధ్వంసం అయి రోడ్ అంతటా పడ్డాయి.అందువల్ల అతడు తొందరగా వెళ్లలేకపోయాడు.
చుట్టుపక్కల వారు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

తల్లి, కుమార్తె, అలాగే రిక్షా పుల్లర్, ఇతర గాయపడిన వ్యక్తులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ర్యాష్ డ్రైవింగ్, ప్రాణాలకు హాని కలిగించడం, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు డ్రైవర్ చట్టపరమైన చర్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.







