నల్గొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.జిల్లా మంత్రుల దగ్గరే ముఖ్యమైన శాఖలు ఉన్నాయని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పదకొండు స్థానాల్లో గెలిచి మరోసారి జిల్లా కంచుకోటగా నిరూపితమైందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.నల్గొండ జిల్లా అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు.
మంత్రులున్న జిల్లాలే కాకుండా రాష్ట్రాన్ని అన్ని నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే వచ్చే వంద రోజుల్లో తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.







