రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఇల్లంతకుంట మండలంలోని ముస్కనిపేట రోడ్డులో సోమవారం రోజున ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ వాహనాల తనిఖీలు చేపట్టగా మద్యం సేవించి వాహనాలు నడిపిన ముస్కనిపేట కు చెందిన ఒకరిపై ,చౌడరం గ్రామానికి చెందిన ఒకరిపై కేసు నమోదు చేయడం జరిగిందని,అలాగే రోడ్లపై సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 31 వాహనాల పైన రూ 4180/- జరిమానా విధించడం జరిగిందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఎస్సై సుధాకర్( SI sudhakar ) మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితె కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన చోటే నేరాలు ఎక్కువ జరుగుతున్నాయని తద్వారా సమాజానికి కీడు జరుగుతుందని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై కోరారు.
వాహనాల తనిఖీలలో ఏఎస్సై లు సంజీవరావు, మోతిరాం, హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, కానిస్టేబుల్ లు కుంట.శ్రీనివాస్, శ్రీకాంత్ లు పాల్గొన్నారు
.